
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫిబ్రవరి 26న అని వార్తలు, ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
- విజయ్ ఇంటికి లైటింగ్స్, పెళ్లి కళతో సందడిగా వాతావరణం!
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ ఫ్యామిలీ, పెళ్లికి ఆహ్వానం!
- ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లి, హైదరాబాద్ తాజ్ కృష్ణలో రిసెప్షన్ అంటూ ప్రచారం
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విజయ్ దేవరకొండ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? రష్మిక మందన్నతో ఆయన వివాహం ఫిబ్రవరి 26న జరగనుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి బలం చేకూర్చేలా విజయ్ ఇంటి వద్ద సందడి నెలకొంది.
విజయ్ ఇంటి దగ్గర పెళ్లి సందడి!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda), హీరోయిన్ రష్మికా మందన్నను ( Rashmika) పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా సంవత్సరాలుగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట పెళ్లి గురించి కూడా వార్తలు అలాగే వైరల్ అవుతున్నాయి. ఎక్కడ కూడా పెళ్లి పై సమాధానం చెప్పకుండా.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఫిబ్రవరి 26వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న వివాహం జరగబోతుందని తెలుస్తోంది. ఇది ప్రచారం మాత్రమే. విజయ్ దేవరకొండ సైడ్ నుంచి గానీ..రష్మికా మందన్న నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ పెళ్లి ఏర్పాట్లు చక చకా జరుగుతోన్నట్లు టాక్ నడుస్తోంది.
రష్మికా మందన్నతో ఈ నెల 26 వ తేదీన విజయ్ దేవరకొండ పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే విజయ్ దేవరకొండ ఇంటి దగ్గర పెళ్లి సందడి స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఇంటికి పూర్తిగా లైటింగ్స్ పెట్టారు. ఓ పెళ్లి ఇంటిని ఎలా ముస్తాబు చేస్తారో? అచ్చం అలాగే చేశారు. దీంతో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వివాహం వివాహం ఫిబ్రవరి 26వ తేదీన జరగబోతుందని మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఇటీవల కాలంలో ఈ జంట పెళ్లి కార్డు కూడా వైరల్ అయింది. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ కలిసింది. ఈ సందర్భంగా తన పెళ్లికి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం ఇచ్చారట హీరో విజయ్ దేవరకొండ. ఈ తరుణంలోనే విజయ్ దేవరకొండ పెళ్లికి సంబంధించిన కార్డు వైరల్ అయింది.
ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వివాహం?
ఈ కార్డు వివరాలు ప్రకారం ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ లోని ఓ ప్రముఖ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి జరగబోతుందట. ఇక మార్చి 4వ తేదీన హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ (Taj Krishna) హోటల్ లో ఈ జంటకు సంబంధించిన రిసెప్షన్ ఉంటుందని ప్రాథమిక సమాచారం అందుతోంది. ఉదయపూర్ లో జరిగే వివాహం చాలా గోప్యంగా, కొంతమంది గెస్ట్ ల నడుమ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే పెళ్లిపై అధికారిక ప్రకటన చేయడం లేదట విజయ్ దేవర కొండ, రష్మిక జంట. అటు ఉదయపూర్ లో తమ పెళ్లికి వచ్చే గెస్ట్ లు కూడా ఫోటోలు తీయకుండా కండిషన్స్ కూడా పెట్టారట. అటు హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా నిర్వహించాలని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
రిసెప్షన్ తాజ్ కృష్ణలో.. ఆహ్వాన పత్రిక వైరల్!
A post shared by Viral Bhayani (@viralbhayani)
విజయ్, రష్మిక పెళ్లి వార్తలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


