
📌 Key Points
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్ సైకిల్ ర్యాలీ.
- పూలు చల్లడంతో సైకిల్ వదిలి వెళ్ళిన విజయ్, వీడియో వైరల్.
- విజయ్ చర్యను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, ఫ్యాన్స్ మద్దతు.
- సెక్యూరిటీ హడావిడి వల్లే విజయ్ అలా చేశారని అభిమానుల వాదన.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ హీరో విజయ్ సైకిల్ పై ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే, ఒక సంఘటన కారణంగా ఆయన ప్రచారం మధ్యలోనే ఆగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
విజయ్ సైకిల్ ప్రచారం, అభిమానుల హడావిడి
తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. అయితే ఈ సందర్భంగా తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సైకిల్ పైన ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ వీడియో, ఇప్పుడు వైరల్ గా మారింది.
తమిళనాడు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సైకిల్ తొక్కుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు విజయ్. అయితే సైకిల్ పైన విజయ్ ప్రచారం చేస్తున్న తరుణంలో… ఆయన వెంట వేలాది మంది అభిమానులు వచ్చారు. అటు సాధారణ ప్రజలు కూడా రోడ్డు ఎక్కారు. విజయ్ ని చూసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని..విజయ్ సైకిల్ ముందు పూలు చల్లాడు.
పూలు చల్లడంతో ఆగిన విజయ్, వైరల్ వీడియో
ఇక ఆ పూలను విజయ్ ఏమనుకున్నాడో తెలియదు కానీ, నడిరోడ్డు పైన సైకిల్ వదిలేసి.. తన వాహనంలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పూలు చల్లితే బాంబులు అనుకొని, విజయ్ పారిపోయాడని ఆడుకుంటున్నారు. విజయ్ కామెడీ పీస్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక విజయ్ ఫ్యాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ హడావిడి చేసిన నేపథ్యంలోనే విజయ్ అలా వెళ్లిపోయాడని కౌంటర్లు ఇస్తున్నారు. అనవసరంగా విజయ్ ట్రోల్స్ చేస్తే, ఊరుకునేది లేదంటూ సీరియస్ అవుతున్నారు.
నెటిజన్ల ట్రోల్స్, అభిమానుల సమర్థన
A post shared by CNBC-TV18 (@cnbctv18india)
మొత్తానికి విజయ్ సైకిల్ యాత్ర ఒక ఊహించని మలుపు తిరిగింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయంగా దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.


