|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ సీఎం కాలేదని ఆత్మహత్యాయత్నం: అభిమానుల పిచ్చి పరాకాష్టకు!

Published: 09-05-2026, 8:46 AM
విజయ్ సీఎం కాలేదని ఆత్మహత్యాయత్నం: అభిమానుల పిచ్చి పరాకాష్టకు!
  • టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్ సీఎం ప్రమాణస్వీకారంపై సందిగ్ధత.
  • విజయ్ సీఎం కాలేదని 40 ఏళ్ల అభిమాని ఇసక్కియప్పన్ ఆత్మహత్యాయత్నం.
  • గతంలో విజయ్ గెలవాలని ముఖానికి 16 ఈటెలు గుచ్చుకున్న అదే అభిమాని.
  • ఫలితాలకు ముందే మరో అభిమాని ఆత్మహత్యాయత్నం, అభిమానుల తీరుపై ఆందోళన.

టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం సందిగ్ధంగా మారడంతో, అభిమానుల ఆవేశం పరాకాష్టకు చేరుకుంది. విజయ్ సీఎం కాలేదని తీవ్ర నిరాశకు గురైన ఓ అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో, అభిమానుల అతి భక్తిపై తీవ్ర చర్చకు దారితీసింది.

విజయ్ సీఎం ప్రమాణస్వీకారంలో జాప్యం, ట్విస్టులు

టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం అరవసీరియల్ ను తలపిస్తోంది. కథ ముందుకు సాగకుండా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల అనంతరం రెండు రోజుల్లో ప్రమాణస్వీకారం ఉందని అనుకోగా గవర్నర్ మెజారిటీ లేదంటూ షాక్ ఇచ్చారు. తరవాత పొత్తుల కోసం ప్రయత్నిస్తే ఇతర పార్టీలు కండిషన్స్ పెడుతున్నాయి. దీంతో ఆ పొత్తులు కుదరగా విజయ్ ప్రమాణస్వీకారం సందిగ్దంగా మారింది. ఈ క్రమంలో ఆ టెన్షన్ తట్టుకోలేక ఓ అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సుమారు 40 ఏళ్ల వయసున్న ఇసక్కియప్పన్ శనివార తమ అభిమాన హీరో విజయ్ ప్రమాణస్వీకారం చేస్తాడని కలలు కన్నాడు.

కానీ తాను ఊహించినట్టుగా జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంట‌నే స్థానికులు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ప్ర‌స్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే వ్య‌క్తి గ‌తంలో విజ‌య్ సీఎం అవ్వాల‌ని త‌న ముఖానికి 16 పొడవైన ఈటెల‌ను గుచ్చుకున్న‌ట్టు స‌మాచారం. మొన్న కూడా ఓ అభిమాని విజ‌య్ ఎన్నిక‌ల్లో గెలుస్తాడో లేదో అని భ‌య‌ప‌డి ఫ‌లితాలు రాక‌ముందే ఆత్మ‌హ‌త్యం చేశాడు. ప్ర‌స్తుతం అత‌డు కూడా ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డంతో విజ‌య్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా బాబు అంటూ అంతా త‌ల‌లు పట్టుకుంటున్నారు.

అభిమాని ఆత్మహత్యాయత్నం: గతంలోనూ ఇలాగే

అతి భక్తితో అభిమానుల విపరీత చర్యలు

విజయ్ సీఎం కావాలని అభిమానులు చేస్తున్న ఈ విపరీత చర్యలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. అభిమానం హద్దులు దాటితే అనర్థాలు తప్పవని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.