|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పవన్ కళ్యాణ్ రూట్ లో విజయ్.. సేమ్ డైలాగ్ తో దుమ్ము రేపాడుగా!

Published: 13-02-2026, 9:35 PM
షాకింగ్: పవన్ కళ్యాణ్ రూట్ లో విజయ్.. సేమ్ డైలాగ్ తో దుమ్ము రేపాడుగా!
  • విజయ్ పొలిటికల్ ఎంట్రీ: తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపన!
  • పవన్ కళ్యాణ్ బాటలో విజయ్: పాత డైలాగ్ రిపీట్ చేసి వైరల్!
  • ఎన్నికల్లో డబ్బులు తీసుకోండి, టీవీకేకే ఓటు వేయండి: విజయ్ సంచలన వ్యాఖ్యలు!
  • విజయ్ ప్రసంగం చూస్తుంటే పవన్ కళ్యాణ్ లాగే విజయం సాధిస్తారంటున్న ఫ్యాన్స్!

విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు విజయ్ ఏం మాట్లాడారు? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటి చూద్దాం!

విజయ్ పొలిటికల్ ఎంట్రీ: అసలు కథ ఏంటి?

Vijay: సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది హీరోలు నటులు రాజకీల్లోకి వచ్చారు రాణించారు కూడా. హీరోయిన్స్ కూడా రాజకీయ రంగంలో రాణించారు. ఇటీవల తెలుగు నుంచి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా తమిళనాట స్టార్ హీరో విజయ్(Vijay) కూడా రాజాకీయ రంగప్రవేశం చేశారు. తమిళగా వెట్రి కళగం అనే పార్టీని స్థాపించాడు. ఇక నుంచి సినిమాలకు దూరంగా ఉంటానని, కేవలం ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు.

అన్నట్టుగా అదే ద్యేయంతో ముందుకు సాగుతున్నారు విజయ్. తనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ నేపధ్యంలోనే తాజాగా ఈ రాజకీయ మీటింగ్ లో పాల్గొన్నాడు విజయ్. ఈ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అని మక్కీకి మక్కీ దించేశాడు. దీంతో ఇప్పుడు విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ డైలాగ్ ను దింపేసిన విజయ్!

పార్టీ మీటింగ్ లో విజయ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మీ వోటు కోసం డబ్బులు పంచుతారు. వాటిని వద్దు అనకండి. తీసుకోండి. అందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఆ డబ్బు మీదే. ఆ డబ్బులు తీసుకొని మీ ఓటును మన పార్టీకి అంటే TVK పార్టీ కి వెయ్యండి” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, ఇదే డైలాగ్ ని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా వాడాడు.

విజయ్ స్పీచ్ తో పవన్ ఫ్యాన్స్ ఫిదా!

దీంతో, ఇప్పుడు విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కావాలనే ఆ డైలాగ్ ని ఆయన వాడారా లేదా ఫ్లోలో చెప్పేశారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక విజయ్ చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే ఆయన పవన్ కళ్యాణ్ లాగే తప్పకుండా విజయం సాధిస్తారు అనే కామెంట్స్ కేసుల వినిపిస్తున్నాయి.

విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ప్రసంగాలు, చేస్తున్న పనులు చూస్తుంటే పవన్ కళ్యాణ్ లాగే సక్సెస్ అవుతారని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.