
📌 Key Points
- విజయ్, రష్మికల ‘బడ్డీమూన్’ థాయ్‌లాండ్‌లో కో సముయ్ విల్లాలో జరిగింది.
- ఈ విల్లా కొండలపైన, సముద్రపు వ్యూతో ప్రకృతి నడుమ ఉంది.
- విల్లాలో ఒక్క రాత్రికి అద్దె 2.5 లక్షల రూపాయలు.
- రష్మిక తన భర్త విజయ్‌ను అలా పిలవడం కొత్తగా ఉందని తెలిపింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల బడ్డీమూన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. థాయిలాండ్‌లో విలాసవంతమైన విల్లాలో బస చేసిన ఈ జంట, ఒక్క రాత్రికి రూ.2.5 లక్షలు అద్దె చెల్లించారట.
థాయిలాండ్‌లో విజయ్, రష్మిక బడ్డీమూన్
Vijay Rashmika: టాలీవుడ్ క్యూట్ కపుల్స్ రష్మిక (Rashmika)విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఫిబ్రవరి 26వ తేదీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ జంట తమ పెళ్ళికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ వెళ్తారనుకుంటే అందుకు భిన్నంగా బడ్డీ మూన్ (Buddy Moon) వెళ్లి సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఇలా స్నేహితులతో కలిసి థాయిలాండ్ లో ఈ కొత్త జంట బడ్డీ మూన్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ,వీడియోలను కొత్తజంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే తాజాగా థాయిలాండ్(Thailand) లో రష్మిక విజయ్ బడ్డి మూన్ కోసం థాయ్‌లాండ్‌లోని రెండో అతిపెద్ద ద్వీపమైన ‘కో సముయ్’ (Koh Samui) లోని ‘కో కూన్’ (Koh Koon) అనే అత్యంత విలాసవంతమైన విల్లాలో ఉన్నారు. కొండలపైన సముద్రపు వ్యూ కనిపించేలా ప్రకృతి అందాల నడుమ ఈ విల్లా ఉంది. ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ విల్లా కోసం ఈ కొత్త జంట ఒకరోజు రాత్రికి 2.5 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారని తెలుస్తోంది. విలాసవంతమైన ఈ విల్లా కోసం ఒకరోజు రాత్రికి లక్షల్లో అద్దె చెల్లించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
లగ్జరీ విల్లాలో అద్దె ఎంత?
ఇకపోతే ఇటీవల రష్మిక ఈ వెకేషన్ కి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో భాగంగా విజయ్ దేవరకొండను తన భర్త అని పిలవడం ఇంకా అలవాటు కాలేదని చెప్పుకు వచ్చారు. తన భర్త అని చెప్పుకోవడం చాలా కొత్తగా ఉందని మురిసిపోయారు. అలాగే ఇద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయటం, డాన్స్ చేసిన మూమెంట్స్ అన్నింటిని కలిపి ఒక వీడియోగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా రష్మిక , విజయ్ దేవరకొండ బడ్డీ మూన్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సినిమా పనులలో బిజీ అయిన కొత్తజంట..
వెకేషన్‌లో రష్మిక కామెంట్స్
ఇకపోతే ఈ జంట తమ వెకేషన్ పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ జంట తమ సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ సినిమాతో పాటు రణబాలి అనే సినిమాలోకి నటిస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ జనార్ధన్ సినిమాలో కీర్తి సురేష్ జంటగా నటించగా రణబాలి సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించడం విశేషం. పెళ్లి తర్వాత ఈ జంట మొదటిసారి రణబాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే .
మొత్తానికి విజయ్, రష్మికల బడ్డీమూన్ వెకేషన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.


