|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్, రష్మిక పెళ్లి వార్తల్లో నిజమెంత? హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్!

Published: 10-02-2026, 3:05 AM
విజయ్, రష్మిక పెళ్లి వార్తల్లో నిజమెంత? హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్!
  • విజయ్, రష్మికల మధ్య ప్రేమ, డేటింగ్ వార్తలు ‘గీతాగోవిందం’ సినిమా నుండే మొదలయ్యాయి.
  • వీరిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం బంధాన్ని బలపరిచాయి.
  • ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం, మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుందని సమాచారం.
  • రిసెప్షన్‌కు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులకు ఆహ్వానం అందనుంది.

టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల వివాహం గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం జరగనుందని, మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

విజయ్, రష్మికల ప్రేమ కథ

Vijay -Rashmika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ జంటగా గుర్తింపు సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) , రష్మిక మందన్న (Rashmika mandanna). ‘గీతాగోవిందం’ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. డేటింగ్ కూడా చేసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి.. దీనికి తోడు వీరిద్దరూ కలిసి చట్టపట్టాలేసుకొని తిరగడం.. పైగా వెకేషన్ లకి వెళ్లడం, విజయ్ దేవరకొండ ఇంటి సభ్యులతో రష్మిక సమయాన్ని గడపడం ఇలా ఎన్నో విషయాలు వీరిద్దరి మధ్య బంధాన్ని బలపరిచాయి.

ఇకపోతే ఈ విషయంపై అధికారికంగా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు కానీ వీరు మాత్రం తమ బంధాన్ని ఎక్కడ బయట పెట్టలేదు. కానీ వీరు వెకేషన్ కి వెళ్లి పంచుకున్న ఫోటోలు మాత్రం వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలను రేకెత్తించింది.. దీనికి తోడు గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని కూడా బయట పెట్టలేదు.. అయితే గత రెండు నెలలుగా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలు మరింత హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.. గత రెండు నెలలుగా.. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఉన్న ఒక చారిత్రాత్మక కోటలో వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నారని, పైగా వీరి వివాహానికి డచ్ నుండి ప్రత్యేకమైన గులాబీలు తెప్పిస్తున్నారని.. అంతేకాదు ఉదయపూర్ లోని ఆ చారిత్రాత్మక కోట వీరి వివాహానికి అత్యంత సుందరంగా ముస్తాబవుతోంది అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇలాంటి సమయంలో ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత మార్చి 4వ తేదీన సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నేతల కోసం మార్చి 4వ తేదీన హైదరాబాద్లోనే రిసెప్షన్ జరుపుకోనున్నారు అంటూ సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు, రాజకీయ నేతలు, అలాగే అభిమానులకి కూడా అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే పెళ్లి రాజస్థాన్లోనే జరుగుతుందని కానీ రిసెప్షన్ మాత్రం హైదరాబాదులో ఉంటుందంటూ వస్తున్న వార్తలు అభిమానులను సంతోషపరుస్తున్నాయి . కానీ దీనిపై అటు రష్మిక ఇటు విజయ్ దేవరకొండ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

వివాహంపై వస్తున్న వార్తలు

ఇకపోతే విజయ్ – రష్మిక వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన ఏఐ ఏకంగా వీరిద్దరికీ పెళ్లి జరిగినట్టు ఒక ఫోటోని సృష్టించింది. ఈ ఫోటోకి టాలీవుడ్ నుండీ బాలీవుడ్ వరకు ఉన్న ప్రముఖ సినీ తారలు, దర్శకులు ఈ వివాహానికి వచ్చినట్లు ఏఐ ఒక పిక్చర్ ని జనరేట్ చేయగా.. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పట్టు వస్త్రాలలో పెళ్లికొడుకు , పెళ్ళికూతురులా ముస్తాబయి పీటలపై కూర్చోగా.. వీరి చుట్టూ.. సమంత, అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్, రామ్ చరణ్ , మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో పాటు దిగ్గజ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా వీరి వివాహానికి విచ్చేసినట్లు ఆ ఫోటో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటో నిజమవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

విజయ్-రష్మిక రిసెప్షన్.. ఎక్కడో తెలుసా?

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఈ నెల 26న పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్దఎత్తున ప్రచారం

హైదరాబాద్‌లో రిసెప్షన్?

మార్చి 4న వీరి రిసెప్షన్ హైదరాబాద్‌లోనే జరగనుందని సినీ వర్గాల్లో వార్తలు

News spreading allover social media that Hero Vijay Deverakonda and… pic.twitter.com/6EFYvV0oWI

— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2026

మొత్తానికి విజయ్, రష్మికల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై వారి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.