
📌 Key Points
- విజయ్ నటించిన జననాయగన్ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.
- సినిమా విడుదల కాకముందే వీడియో క్లిప్స్ లీక్ కావడంతో చిత్ర బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది.
- పూజా హెగ్డే లీక్ ఘటనపై స్పందిస్తూ, వేల మంది కష్టం వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
- సినిమా లీక్ అవ్వడం వసూళ్లకు సంబంధించిన విషయం కాదని, కళాకారుడి గౌరవం గురించి అని పూజ అన్నారు.
విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సినిమా లీక్ కావడంపై హీరోయిన్ పూజా హెగ్డే తీవ్రంగా స్పందించారు. ఈ సినిమా కోసం వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడ్డారని ఆమె అన్నారు. సినిమా లీక్ ఘటన తనను ఎంతో బాధించిందని తెలిపారు.
జననాయగన్ సినిమా లీక్
Pooja Hegde: పూజా హెగ్డే ఇటీవల కాలంలో అడపాదడప సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఈమె ఒకానొక సమయంలో వరుస హిట్ సినిమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అయితే పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లుగా మిగలడంతో ఈమె కూడా సినిమా ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చి తిరిగి పలు సినిమాలలో బిజీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమాలో పూజా హెగ్డే విజయ్ జోడిగా నటించిన (Jananayagan) సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా సెన్సార్ కారణాలవల్ల వాయిదా పడింది.
ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంతో ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఇలా సినిమా విడుదల కాకుండానే కొన్ని వీడియో క్లిప్స్ బయటకు రావడంతో చిత్ర బృందం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల చర్యలకు కూడా సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా లీక్ అవడం గురించి ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు కోలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై హీరో విజయ్ మాత్రం ఎక్కడ స్పందించలేదు కానీ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde)ఈ ఘటన పై స్పందించారు.
ఈ సందర్భంగా పూజ హెగ్డే తన సోషల్ మీడియా వేదికగా జననాయగన్ లీక్ అవ్వడం గురించి పోస్ట్ చేస్తూ.. జననాయగన్ సినిమా లీక్ అవ్వడం తనని ఎంతగానో కలిచి వేసిందని తెలిపారు. ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే ఆ సినిమా వెనుక వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కష్టం వారి త్యాగాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో మేమంతా లెక్కలేనన్నీ గంటలు కష్టపడితే ఇలా జరగడం బాధగా అనిపిస్తుంది ఇలా సినిమా ఆన్లైన్లో లీక్ అవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యానని పూజా హెగ్డే తెలిపారు.
పూజా హెగ్డే ఆవేదన
#JanaNayagan pic.twitter.com/GWw0mKu3fz
— Pooja Hegde (@hegdepooja) April 11, 2026
చిత్ర బృందం ఆగ్రహం
సినిమా లీక్ అవడం అనేది వసూళ్లకు సంబంధించిన విషయం కాదని ఇది ఒక కళాకారుడికి దక్కాల్సిన గౌరవం గురించి అంటూ పోస్ట్ చేశారు ఇక విజయ్ సర్ కు ఇది ఆకరి సినిమా ఈ సినిమాని మనం అందరం థియేటర్లలో చూసి సెలబ్రేట్ చేయాలని మరికొద్ది రోజులు ఓపిక పడితే ఈ సినిమా సరైన సమయంలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని పూజ హెగ్డే ఈ సినిమా లీక్ అవడం గురించి ఆందోళన చెందుతూ ఇందుకు కారణమైన వారిపై మండిపడుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక పూజ హెగ్డే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈ సినిమాలో అవకాశం అందుకొని ఈ సినిమా పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ సినిమా స్ విడుదల ఆలస్యం కావడంతో ఈమె కెరియర్ కు కూడా మైనస్ గానే మారిందని చెప్పాలి.
సినిమా లీక్ అనేది కళాకారుల గౌరవానికి సంబంధించిన విషయమని, ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే సినిమాను చూడాలని పూజా హెగ్డే కోరారు. మరికొద్ది రోజులు ఓపిక పట్టమని ఆమె విజ్ఞప్తి చేశారు.


