
📌 Key Points
- విజయ్, రష్మికల మాన్యవార్ యాడ్ పోస్ట్‌కు 8.1 మిలియన్ లైక్స్ వచ్చాయి.
- మెస్సి, రొనాల్డోల లూయిస్ వ్యూటన్ యాడ్‌ను విరోష్ దాటేశారు.
- ఈ జంటకు ఉన్న క్రేజ్‌ను ఈ రికార్డ్ తెలియజేస్తుంది.
- విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో బిజీగా ఉన్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ యాడ్ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సృష్టించింది. మెస్సి, రొనాల్డోల రికార్డును కూడా బద్దలు కొట్టింది.
విరోష్ జోడీ గ్లోబల్ రికార్డు
Virosh: గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) నామస్మరణే నడుస్తోంది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట, ఫిబ్రవరి 26న రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకుని, ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వారు చేసిన ప్రతి కార్యక్రమం ఎంతగానో వైరలైంది. ఫ్యాన్స్, మీడియా ఇలా అందరినీ కలుస్తూ, వారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలలో స్వీట్స్ పంచారు. దేవాలయాల్లో అన్నదానం నిర్వహించారు. ఇంకా సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలందరినీ రిసెప్షన్‌కు ఆహ్వానించి.. వారి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక రిసెప్షన్ ఈవెంటే లాస్ట్ అని కూడా వారు ప్రకటించినా, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి, వారిని ఆశీర్వదించడం.. మరో గొప్ప కార్యక్రమంగా నిలిచింది. ఇలా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాయి అనుకునే లోపు.. మరో రికార్డు వారి ఖాతాలో యాడయింది. అదేంటంటే..
మాన్యవార్ యాడ్‌తో సంచలనం
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ యాడ్ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సృష్టించినట్లుగా టీమ్ అధికారికంగా ప్రకటించింది. స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్‌కు మించిన లైక్స్ విరోష్ (Virosh) చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్‌కు రావడం విశేషం. విజయ్, రష్మిక మాన్యవార్ యాడ్ (Manyavar Couple Ad) పోస్ట్ ఇప్పటి వరకు 8.1 మిలియన్ లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సాధించింది. ఈ పోస్ట్‌కు 104 మిలియన్ల వ్యూస్ రావడం మరో రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్లో విరోష్ జంటకు ఉన్న క్రేజ్‌ను ఈ అరుదైన రికార్డ్ తెలియజేస్తోంది. ఈ విషయం తెలిసి ఈ జంట అభిమానులు వారి పేర్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
విజయ్, రష్మికల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం పెళ్లి కార్యక్రమాలు ముగిశాయి కాబట్టి, ఎవరి పనిలో వారు మళ్లీ బిజీ కానున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘రణబాలి’ చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం తను అంగీకరించిన సినిమాలన్నీ పూర్తయిన తర్వాత.. రష్మిక ఓ సంచలన నిర్ణయం తీసుకోనుందనేలా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఆమె సినిమాలకు దూరం అవుతుందనేలా, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. కానీ, విరోష్ జంట నుంచి మాత్రం ఇప్పటి వరకు అలాంటి ప్రకటనేం రాలేదు.
ఇలా విరోష్ జోడీ మాన్యవార్ యాడ్‌తో గ్లోబల్ రికార్డు సృష్టించి అభిమానులను అలరించింది. పెళ్లి హడావిడి ముగిసిన తర్వాత, ఇద్దరూ తమతమ సినిమాలతో బిజీ కానున్నారు.


