
📌 Key Points
- విజయ్, రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరిగింది.
- కూర్గ్‌లో రష్మిక పుట్టినరోజు వేడుకలు, ఆ తర్వాత రిసెప్షన్ జరిగింది.
- కొడవ సాంప్రదాయంలో రష్మిక చీరకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
- త్వరలో రణబాలి సినిమాలో విజయ్, రష్మిక కలిసి నటించనున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, రష్మిక స్వస్థలమైన కూర్గ్‌లో కొడవ సాంప్రదాయ పద్ధతిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్, రష్మికల వివాహం
Vijay Rashmika: టాలీవుడ్ క్యూట్ కపుల్ రష్మిక విజయ్ దేవరకొండ ప్రస్తుతం తమ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. విజయ రష్మిక గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఫిబ్రవరి 26వ తేదీ ఎంతో ఘనంగా వివాహాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహపు వేడుకలు ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక వివాహ రిసెప్షన్ లో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మొదలుకొని పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు.
ఇలా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన ఈ జంట తిరిగి తమ సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల రష్మిక(Rashmika) పెళ్లి తర్వాత తన మొదటి పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే తన పుట్టినరోజు అనంతరం రష్మిక విజయ్ కూర్గ్ లో మరోసారి వివాహ రిసెప్షన్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. రష్మిక కూర్గు జిల్లాకు చెందిన అమ్మాయి అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్మిక తల్లిదండ్రులు కొత్త జంటకు ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
కూర్గ్‌లో రిసెప్షన్: కొడవ సాంప్రదాయంలో రష్మిక
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వివాహ రిసెప్షన్లో భాగంగా రష్మిక కొడవ సాంప్రదాయ (Kodava Tredition) పద్ధతిలో చీరకట్టి ఎంతో అందంగా ముస్తాబయి కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని ఈ జంట అధికారికంగా షేర్ చేయకపోయినా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఈ రిసెప్షన్ వేడుకల్లో భాగంగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)మాట్లాడుతూ.. నాకు కూర్గ్ మహిళలు అంటే ఎంతో ఇష్టం గౌరవం. కూర్గ్ మహిళలు చాలా అందంగా ఉంటారు. ఇప్పుడు నేను వారిలో ఒకరిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ విజయ్ మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
https:/twitter.com/AyshaMusthaq/status/2041220807909900325
రణబాలి సినిమాలో విజయ్, రష్మిక
ఇలా పెళ్లయిన దాదాపు ఒకటిన్నర నెలకు ఈ జంట మరోసారి రష్మిక సొంత ఊరిలో ఈ వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక విజయ్ దేవరకొండ ముచ్చటగా మూడోసారి వెండి తెరపై సందడి చేయబోతున్నారు. వీరిద్దరూ రణబాలి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు విజయ్ రౌడీ జనార్ధన్ అనే సినిమాలో నటించగా రష్మిక కూడా పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.
మొత్తానికి రష్మిక, విజయ్ దేవరకొండల రిసెప్షన్ వేడుక వారి అభిమానులకు కనువిందు చేసింది. త్వరలో రణబాలి చిత్రంతో వీరిద్దరూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.


