|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విడాకుల బాంబ్ పేల్చిన సంగీత! విజయ్ కి షాక్ ఇచ్చిన సెక్షన్లు!

Published: 28-02-2026, 5:05 AM
విడాకుల బాంబ్ పేల్చిన సంగీత! విజయ్ కి షాక్ ఇచ్చిన సెక్షన్లు!
  • నటుడు విజయ్, భార్య సంగీత విడాకుల కోసం చంగల్ పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
  • సంగీత, విజయ్ పై వివాహేతర సంబంధం, మానసిక వేధింపులు వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
  • విజయ్, త్రిష మధ్య సంబంధం ఉందని వస్తున్న వార్తలే విడాకులకు కారణమని సమాచారం.
  • సంగీత దాఖలు చేసిన పిటిషన్ విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

కోలీవుడ్ నటుడు విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా, విజయ్ పై పలు తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఈ విషయం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగీత

Sangeetha Vijay:  కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడు విజయ్(Vijay), భార్య సంగీత (Sangeetha) విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమైన సంగతి తెలిసిందే. నటుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ రాజకీయాలలోకి అడుగుపెట్టి టీవీకే పార్టీని స్థాపించి ప్రస్తుతం రాజకీయ పనులలో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తన భార్య సంగీత తన నుంచి విడాకులు కోరుతూ చంగల్ పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లో భాగంగా ఈమె విజయ్ గురించి పలు ఆరోపణలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రత్యేక వివాహ చట్టం కింద పలు సెక్షన్లను ఆమె ఈ పిటీషన్ లో ప్రస్తావించినట్టు వార్తలు వస్తున్నాయి.

విజయ్ సంగీత దంపతులకు పెళ్లి జరిగి 26 సంవత్సరాలు అవుతోంది. ఇలా 26 ఏళ్ల తర్వాత వీరు తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలకడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంగీత కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ లో భాగంగా ఈమె పలు సెక్షన్ లపై కేసు నమోదు చేయడంతో ఇది కాస్త విజయ్ వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా రాజకీయ భవిష్యత్తుపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తోంది. మరి సంగీత విజయ్ పై మోపిన అభియోగాలు ఏంటి అనే విషయానికి వస్తే…

విజయ్ పై సంగీత మోపిన అభియోగాలు

సంగీత విజయ్ పై సెక్షన్ 27(1)(A) వివాహేతర సంబంధం, సెక్షన్ 27(1)(B) మానసిక వేధింపులు, సెక్షన్ 27(1)(D) నిర్లక్ష్యం ఆర్థికం ఆంక్షలు సెక్షన్ల కింద ఆయనపై కేసును నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇలా సంగీత విజయ్ పై ఇలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో ఇది కాస్త ఆయన రాజకీయ ప్రయాణానికి పెద్ద ఎత్తున ఆటంకాన్ని కలిగిస్తుందని విజయ్ రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విజయ్ భార్య సంగీత కోర్టును ఆశ్రయించి విడాకులు కోరుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు విజయ్ మాత్రం ఈ విషయంపై ఎక్కడ స్పందించలేదు.

నటి త్రిషతో రిలేషన్ నిజమేనా?

త్రిషతో ఎఫైర్ కారణంగా విడాకులు?

ఇక విజయ్ సంగీత 26 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకోవడానికి కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా విజయ్ నటి త్రిషతో చాలా చనువుగా ఉంటున్నారని వీరి మధ్య రిలేషన్ కొనసాగుతోందంటూ వార్తలు బయటకు వచ్చాయి ఈ నేపథ్యంలోనే సంగీత విజయ్ నుంచి విడాకులు తీసుకుని విడిపోతున్నారు అంటూ గత ఏడాది కాలం పాటు వార్తలు వస్తున్నప్పటికీ ఎక్కడ ఈ జంట స్పందించలేదు కానీ సంగీత స్వయంగా విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో విజయ్ త్రిష గురించి వచ్చిన రూమర్లు నిజమేనని భావిస్తున్నారు. ఇక ఈ విషయంపై త్రిష కూడా ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్ త్వరలోనే విచారణకు రానుంది.

మొత్తానికి విజయ్, సంగీత విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. దీనిపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ పరిణామాలు ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.