
📌 Key Points
- విజయ్ ఎన్నికల హడావిడిలో ఉండగా, విడాకుల కేసు వ్యవహారం తెరపైకి వచ్చింది!
- చెన్నైలోని అన్నానగర్ లో ఉన్న 35 కోట్ల విలువైన ఆస్తిని అమ్మేసిన విజయ్!
- ఎన్నికల ఖర్చు కోసమే విజయ్ ఆస్తులను అమ్ముతున్నారని సమాచారం.
- మరికొన్ని ఆస్తులను కూడా అమ్మడానికి విజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం!
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు విడాకుల వార్తలు ఆయన అభిమానులను షాక్ కి గురి చేస్తున్నాయి. దీనికి తోడు ఆయన ఆస్తులను అమ్మడం మరింత సంచలనంగా మారింది.
విడాకుల వార్తలతో కలకలం రేపుతున్న విజయ్
Vijay : తమిళ్ స్టార్ హీరో గత కొన్నాళ్లుగా తమిళనాట వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పార్టీ పెట్టి ప్రచారం మొదలుపెట్టారు. ఏప్రిల్ లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నాడు విజయ్. ఎలక్షన్స్ కోసం విజయ్ బిజీగా ఉన్న సమయంలో ఇటీవల విజయ్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉందంటూ అతని భార్య సంగీత విడాకుల కేసు వేయడంతో సంచలనంగా మారింది.
ఎన్నికల కోసం ఆస్తులు అమ్ముతున్నారా?
ప్రస్తుతం విజయ్ – సంగీత విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. అయితే కోర్టు బయట 200 కోట్లు ఇచ్చి ఈ మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని విజయ్ చూస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇలా ఓ వైపు ఎన్నికల హడావిడి, మరోవైపు విడాకుల కేసు ఉన్న సమయంలో విజయ్ ఓ ప్రాపర్టీని అమ్మేయడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు.
35 కోట్ల ఆస్తి అమ్మకం.. కారణం అదేనా?
చెన్నై లోని అన్నా నగర్ లో విజయ్ కి ఉన్న ఓ ప్రాపర్టీని 35 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం. అలాగే చెన్నైలోని మరి కొన్ని ప్రాపర్టీలను కూడా అమ్మడానికి విజయ్ చూస్తున్నట్టు సమాచారం. వాటికి కూడా బేరసారాలు జరుగుతున్నాయని తమిళ మీడియా అంటుంది. ఎన్నికల ఖర్చు కోసం విజయ్ ఈ ప్రాపర్టీలను అమ్మేస్తున్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల వేళ ఆస్తుల అమ్మకం వెనుక అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.


