|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్‌ సేతుపతి- నిత్యా మీనన్‌ ‘తలైవా తలైవి’ టీజర్‌ విడుదల

Published: 04-05-2025, 2:18 AM
విజయ్‌ సేతుపతి- నిత్యా మీనన్‌ 'తలైవా తలైవి' టీజర్‌ విడుదల

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మరియు నిత్యామీనన్ నటించిన ‘తలైవా తలైవి’ సినిమా టైటిల్ టీజర్ విడుదలైంది. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. టీజర్ లో వినోదభరితమైన సన్నివేశాలు ఉన్నాయి.

Key Points

1

విజయ్ సేతుపతి మరియు నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

2

పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం.

4

భార్యాభర్తలుగా వారిద్దరి మధ్య సరదా గొడవలు టీజర్ లో చూపించారు.

తలైవా తలైవి టీజర్ విడుదల

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి కొత్త సినిమా టైటిల్‌ ప్రకటించారు. ‘తలైవా తలైవి’ టైటిల్‌ను మేకర్స్‌ పిక్స్‌ చేశారు. దీనిని ప్రకటిస్తూ తాజాగా టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు.  పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రంతో జాతీయ అవార్డ్‌ విన్నింగ్‌ హీరోయిన్‌ నిత్యామీనన్‌ ఆయనకు జోడీగా నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్‌ వినోద్‌ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల కానుంది.

విజయ్ సేతుపతి – నిత్యామీనన్ జంట

ఇకపోతే ఇందులో నటుడు విజయ్‌ సేతుపతి పరోటా మాస్టర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయన కొంత శిక్షణ పొందినట్లు సమాచారం. గతంలో ‘19 (1)(ఎ)’ సినిమాలో విజయ్‌ సేతుపతి, నిత్యామీనన్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఇద్దరూ పాండిరాజ్‌ సినిమా కోసం మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.

పాండిరాజ్ దర్శకత్వం

నిత్యామీనన్, విజయ్ సేతుపతి కలిసి కిచెన్‌లో వంటను ప్రిపేర్ చేస్తూనే గొడవపడుతూ ఉంటారు. వారిద్దరూ సరదాగా పోట్లాడుకుంటూ భార్యాభర్తలుగా  కనిపిస్తారు. ఒకరిపైమరోకరు పెద్దగా అరవడం మొదలు పెడుతారు. అప్పుడు విజయ్‌ చేసేదేం లేక  తన నోటికి టవల్‌ని కట్టుకొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండిపోతాడు. ఈ మూవీలో నిత్యామీనన్‌ డామినేషన్‌ ఎక్కువగా కనిపించేలా ఉంది.

మొత్తంగా, ‘తలైవా తలైవి’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయ్ సేతుపతి మరియు నిత్యామీనన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.