
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో రానున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పూరిసేతుపతి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్ విడుదలైంది. ప్రముఖ నటి టబు ఈ చిత్రంలో పవర్‌ఫుల్ రాణి పాత్రలో నటించనుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ అంచనాలు పెంచుతోంది.
Key Points
విజయ్ సేతుపతి-పూరి జగన్నాథ్ కాంబోలో 'పూరిసేతుపతి' వర్కింగ్ టైటిల్‌తో భారీ పాన్ ఇండియా చిత్రం.
నటి టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె పవర్‌ఫుల్ రాణి పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది.
టబు నటనతో స్క్రీన్‌ను షేక్ చేయడం ఖాయమని, ఆమె పాత్ర తీవ్రంగా ఉంటుందని మేకర్స్ పోస్ట్.
పూరిసేతుపతి: పాన్ ఇండియా ప్రాజెక్ట్ వివరాలు
కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi,), పూరి జగన్నాథ్ (Puri Jagannath)కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రానుంది. ‘పూరిసేతుపతి’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. జెబి మోషన్ పిక్చర్స్, పూరి జగన్నాథ్ బ్యానర్స్‌పై చార్మీ కౌర్, పూరి జగన్నాథ్, నారాయణ రావు నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ కుమార్, వీటీవీ గణేష్, రాధికా ఆప్టే, టబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా నుంచి ఓ స్టార్ నటికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
నేడు టబు పుట్టినరోజు కావడంతో ఆమెకు విషెస్ తెలుపుతూ మేకర్స్.. విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు. రత్నం వంటి నటి టబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ చిత్రంలో ఆమె నటన తీవ్రంగా ఉంటుంది. తన అద్భుతమైన యాక్టింగ్‌తో స్క్రీన్‌ను షేక్ చేయడం ఖాయం. పవర్ ఫుల్ రాణిగా మీ ముందుకు రానుంది’’ అని తెలిపారు. అలాగే గల్లా చొక్కా దానిపై బ్లాక్ జాకెట్, జీన్స్, షూస్ ధరించి గాగూల్స్ పెట్టుకుని సీరియస్ లుక్‌లో నిల్చొని ఉన్న పిక్ షేర్ చేసి అంచనాలను పెంచారు. అయితే ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
పవర్‌ఫుల్ రాణిగా టబు ఎంట్రీ
అంచనాలు పెంచుతున్న ‘బెగ్గర్’ (వర్కింగ్ టైటిల్)
పవర్‌ఫుల్ రాణిగా టబు నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘బెగ్గర్’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.


