
📌 Key Points
- విజయ్ దళపతి కొత్తగా టీవీకే అనే రాజకీయ పార్టీని స్థాపించారు.
- విజయ్ బాడీగార్డ్ చేతిలోని సూట్ కేసు ఒక బుల్లెట్ ప్రూఫ్ కవచం.
- కెవ్లార్ అనే బలమైన పదార్థంతో ఈ సూట్ కేసును తయారు చేస్తారు.
- పువ్వులు, టవల్స్ వంటి వస్తువుల నుండి కూడా ఈ కవచం విజయ్‌ను రక్షిస్తుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన వెంట ఉండే బాడీగార్డ్ చేతిలోని సూట్ కేసు గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆ సూట్ కేసు ఒక బుల్లెట్ ప్రూఫ్ కవచం అని తెలుస్తోంది.
విజయ్ రాజకీయ ప్రవేశం, ఎన్నికల ప్రచారం
Vijay Thalapathy: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) ఒకవైపు సినిమాలలో ప్రేక్షకులను అలరిస్తూనే మరొకవైపు రాజకీయాలలో సత్తా చాటాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే టీవీకే అనే రాజకీయ పార్టీని స్థాపించి.. ఈ పార్టీ ద్వారా తమిళనాడులో ఏప్రిల్ 23వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధం అయిపోయారు. అందులో భాగంగానే విస్తృతంగా తమిళనాడులో ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగానే ఎక్కడ చూసినా బాడీగార్డ్ (బౌన్సర్) లతో విజయ్ దళపతి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ విజయ్ పక్కన ఉండే బాడీగార్డ్ చేతిలో ఎప్పుడూ ఒక నల్లటి సూట్ కేస్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించే ఉంటారు. అయితే ఈ సూట్ కేసులో ఏముంది? ఎందుకు ఆయన బాడీగార్డ్ (బౌన్సర్) అలా పట్టుకుని తిరుగుతున్నారు.? ఇందులో ఏమైనా డబ్బు ఉందా? లేక మరేదైనా రహస్య వస్తువులు ఉన్నాయా? అనే సందేహం అందరికీ కలగవచ్చు. కానీ ఆ సూట్ కేసు యొక్క అసలు ప్రాముఖ్యత, అవసరం ఏంటో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.
సూట్ కేసులో దాగి ఉన్న రక్షణ కవచం
వాస్తవానికి నెటిజన్లు అనుకుంటున్నట్లుగా ఆ సూట్ కేసులో డబ్బు కానీ ఫైల్స్ కానీ లేదా విజయ్ వ్యక్తిగత వస్తువులు కానీ ఏవి ఉండవు. అది సూట్ కేస్ రూపంలో ఉన్న ఒక రక్షణ కవచం. ప్రపంచ నాయకులు , దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అలాగే ఇతర అత్యంత ప్రమాదకరమైన విఐపి లకు భద్రత కల్పించే కమాండోల చేతుల్లో సాధారణంగా ఈ ప్రత్యేక సూట్ కేసు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం విజయ్ రక్షణ కోసమే ఆయన బౌన్సర్లు దీనిని తీసుకెళుతున్నారు..
కెవ్లార్ సూట్ కేసు ఎలా పనిచేస్తుంది?
ఇక ఇది ఎలా పని చేస్తుంది అనే విషయానికి వస్తే.. ఈ సూట్ కేస్ ను కెవ్లార్ అనే చాలా బలమైన బుల్లెట్ ప్రూఫ్ పదార్థంతో తయారుచేస్తారు.. ఎవరైనా అనుకోకుండా కాల్చడానికి ప్రయత్నిస్తే బౌన్సర్ వెంటనే సూట్ కేస్ పైన ఉన్న బటన్ నొక్కుతాడు. అంతే రెప్పపాటులో ఆ సూట్ కేసు ఒక పెద్ద కవచంలా మారిపోయి విజయ్ ను బుల్లెట్ల నుండి పూర్తిగా కాపాడుతుంది.. ఇకపోతే విజయ్ ను ప్రచార సభలలో చూసినప్పుడు అత్యుత్సాహంతో అభిమానులు తరచుగా వేదిక వైపు పువ్వులు, టవల్స్ లేదా గట్టి నొక్కదుమా వస్తువులను విసురుతారు ఇక అలాంటి వస్తువుల నుండి విజయను రక్షించడానికి ఈ కవచం ఉపయోగపడుతుంది. కొన్ని మెరుగైన బాలిస్టిక్ సూట్ కేసులలో రక్షణ కోసం రహస్య పరికరాలు, ఆయుధాలను ఉంచుకునే సౌకర్యం కూడా ఉంటుంది .ఇక ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే వీఐపీని సురక్షితంగా తీసుకెళ్లడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. వీటి ధర సుమారుగా 50వేల నుండి 1,50, 000 వరకు ఉంటుంది.. మొత్తానికి అయితే విజయ్ బౌన్సర్ చేతిలో ఉండే ఈ నల్లటి సూట్ కేస్ ఇప్పుడు అందరూ దృష్టిని ఆకట్టుకుంటోంది.
విజయ్ దళపతి భద్రత కోసం ఆయన బాడీగార్డ్ ఉపయోగించే ఈ సూట్ కేసు ఒక అత్యాధునిక రక్షణ వ్యవస్థ. ఇది ఆయనకు ప్రమాదాల నుండి కాపాడుతుంది.


