|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ తలపతి సంచలన నిర్ణయం: సినిమాలకు గుడ్‌బై.. రాజకీయాల్లోకి పూర్తి స్థాయి అరంగేట్రం! చివరి సినిమా ఏంటంటే?

Published: 28-12-2025, 8:50 AM
విజయ్ తలపతి సంచలన నిర్ణయం: సినిమాలకు గుడ్‌బై.. రాజకీయాల్లోకి పూర్తి స్థాయి అరంగేట్రం! చివరి సినిమా ఏంటంటే?
  • స్టార్ హీరో విజయ్ తలపతి రాజకీయాలలోకి పూర్తిస్థాయిలో అరంగేట్రం.
  • కొత్త పార్టీ ‘టీవీకే’ను ప్రారంభించి తమిళనాడు ఎన్నికలలో పోటీకి సిద్ధం.
  • ప్రజాసేవకు సమయం కేటాయించేందుకు సినిమాలకు గుడ్‌బై చెప్పారు.
  • ఆయన చివరి చిత్రం ‘జననాయగన్’ జనవరి 9న విడుదల కానుంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలపై పూర్తిస్థాయి దృష్టి సారించేందుకు సినిమాలకు గుడ్‌బై చెప్పారు. టీవీకే పార్టీని ప్రారంభించిన విజయ్, ఇకపై ప్రజాసేవకు అంకితం కానున్నారు. ఆయన చివరి చిత్రం ‘జననాయగన్’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ్ తలపతి రాజకీయ అరంగేట్రం

Vijay Thalapathy: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది. సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సెలబ్రిటీలు తిరిగి రాజకీయాలలోకి వెళ్లి అక్కడ కూడా మంచి పదవులను అధిరోహించిన సంగతి తెలిసిందే. ఇలా ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు ముఖ్యమంత్రులుగా కూడా బాధ్యతలను తీసుకున్నారు. ఇక ప్రస్తుతం కూడా పలువురు సెలబ్రిటీలు రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న విజయ్ థళపతి(Vijay Thalapathy) కూడా ఇటీవల రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు.

విజయ్ తలపతి టీవీకె పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఈయన పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాజకీయ వ్యవహారాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయాల పరంగా బిజీ అవుతున్న విజయ్ తలపతి సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈయన పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సాధించబోతున్న నేపథ్యంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ప్రస్తుతం ఈయన నటించిన జననాయగన్ సినిమానే తన ఆఖరి సినిమా అని తెలిపారు.

సినిమాలకు గుడ్‌బై.. కారణం ఇదే!

ఇన్ని సంవత్సరాలు పాటు తనకు ఇండస్ట్రీలో పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేసిన వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. తనని ఇంతలా ప్రేమించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇక పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయిస్తానని మరో 30 సంవత్సరాలు రాజకీయాలలో కొనసాగుతూ అభిమానులకు సేవ చేస్తానని తెలిపారు. ప్రజాసేవ చేయటం కోసమే సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. తమ అభిమాన హీరోని వెండితెరపై చూడలేమని అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేసిన రాజకీయాల పరంగా ఈయనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు.

సంక్రాంతి బరిలో జన నాయగనన్..

ఆఖరి సినిమా ‘జననాయగన్’ వివరాలు

ఇక విజయ్ నటించిన జననాయగన్సినిమా జనవరి 9వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను మలేషియాలో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ నటించిన ఆఖరి సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. మరోవైపు ఈయన సినిమాలకు గుడ్ బై చెబుతూ రాజకీయాలలో పూర్తిగా బిజీ కానున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

విజయ్ తలపతి సినిమాలకు దూరమవుతుండటం అభిమానులను నిరాశపరిచినా, రాజకీయ రంగంలో ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ప్రజాసేవ లక్ష్యంగా ఆయన నిర్ణయం విజయవంతం కావాలని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.