|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్, త్రిష: సీక్రెట్ రిలేషన్ బట్టబయలు? బాడీగార్డ్ సంచలన ట్వీట్!

Published: 06-03-2026, 6:35 AM
విజయ్, త్రిష: సీక్రెట్ రిలేషన్ బట్టబయలు? బాడీగార్డ్ సంచలన ట్వీట్!
  • విజయ్, సంగీత విడాకుల వార్త కోలీవుడ్‌లో సంచలనం.
  • విజయ్, త్రిష రిలేషన్ రూమర్స్‌పై బాడీగార్డ్ పోస్ట్ వైరల్.
  • కలిపితి సురేష్ కుమారుడి రిసెప్షన్‌కు కలిసి హాజరైన విజయ్, త్రిష.
  • అరుణ్ సురేష్ పోస్ట్ ద్వారా త్వరలో రిలేషన్ ప్రకటన ఉంటుందా అనే చర్చ.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. అంతేకాకుండా నటి త్రిషతో రిలేషన్ ఉందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.

విజయ్, సంగీతల విడాకుల వ్యవహారం

Vijay Thalapathy -Trisha: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ రాష్ట్ర రాజకీయాలలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నటుడు విజయ్ (Vijay)తన భార్య సంగీత(Sangeetha) విడాకులు తీసుకోబోతున్నారని వార్త సంచలనం రేపింది. గత కొంతకాలంగా విజయ్ వైవాహిక బంధం గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి విజయ్ నటి త్రిష రిలేషన్ లో ఉన్నారని అందుకే తన భార్యకు తనకు మధ్య విభేదాలు వచ్చాయి అంటూ వార్తలు వచ్చాయి. ఇలా గత కొంతకాలంగా వీరి విడాకుల గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విధంగానే సంగీత విడాకులు కోరడం సంచలనగా మారింది.

తన భర్త విజయ్ నుంచి తనకు విడాకులు కావాలని సంగీత చంగల్ పట్టు కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందా ఇందులో భాగంగా తన భర్తకు వివాహేతర సంబంధం ఉంది అంటూ ఈమె పేర్కొన్నారు. ఇలా సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో త్రిష విజయ్ రిలేషన్ రూమర్లకు మరింత బలం చేకూరింది . అయితే వీరిద్దరి గురించి వస్తున్న వార్తలను నిజం చేస్తూ విజయ్ త్రిష కలిసి ఇటీవల ఓ పెళ్లి వేడుకకు హాజరైన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకే రంగు దుస్తులను ధరించి ఒకే కారులో ఏజీఎస్ ప్రొడక్షన్స్ అధినేత కల్పితి సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియో బయటకు రావడానికి కంటే కొన్ని నిమిషాల ముందు విజయ్ బాడీ గార్డ్ అరుణ్ సురేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఈ సందర్భంగా అరుణ్ సురేష్ పోస్ట్ చేస్తూ “అన్ని పుకార్లకు చెక్ పెట్టే సమయం వచ్చేసింది” అంటూ పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్ పెట్టిన వెంటనే అరుణ్ డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న విజయ్ బాడీగార్డ్ పోస్ట్

VIJAY Naa PERSONAL Bodyguard #AroonSuresh Insta Story !! 😮‍💨🔥 pic.twitter.com/C3vzXWV7SY

— Prakash Vijay (@PrakazVijay_Of) March 5, 2026

రిసెప్షన్‌లో కలిసి కనిపించిన విజయ్, త్రిష

ఈ విధంగా సురేష్ చేసిన ఈ పోస్ట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఈయన త్రిష రిలేషన్ గురించి ఇలా కన్ఫర్మ్ చేసేసారా త్వరలోనే వీరిద్దరూ తమ రిలేషన్ ని ప్రకటిస్తూ ఒకటి కాబోతున్నారా? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా విజయ్ త్రిషకు సంబంధించిన వీడియో ద్వారా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని చెప్పకనే చెప్పేశారు. తన భార్య సంగీత నుంచి విడాకులు రావడమే ఆలస్యం విజయ్ త్రిష కొత్త జీవితం ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. విజయ్ సంగీత వ్యవహారం కోర్టులో కాకుండా వ్యక్తిగతంగానే డీల్ చేయడం కోసం తన భార్య సంగీతకు ₹250 కోట్ల రూపాయలు భరణం కింద విజయ్ ఆఫర్ చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి విజయ్, త్రిషల రిలేషన్ గురించి వస్తున్న వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై వారిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.