|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైరల్ వీడియో: అభిమానిపై ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం.. కారణం ఏంటంటే?

Published: 06-01-2026, 11:15 PM
వైరల్ వీడియో: అభిమానిపై ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం.. కారణం ఏంటంటే?
  • ఫోటోలు తీయొద్దన్నా వినకుండా కెమెరా క్లిక్ చేయడంతో ఎన్టీఆర్ ఆగ్రహం.
  • ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
  • ఎన్టీఆర్ కొత్త లుక్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది, ట్రోల్స్‌కు దారితీసింది.
  • కొత్త లుక్, కామెంట్లపై యాంటీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య కోల్డ్ వార్.

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో అభిమాని ఫోటో తీయడానికి ప్రయత్నించగా ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది? ఎన్టీఆర్ ఆగ్రహం వెనుక నిజం

Jr.NTR:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఇక ఇప్పుడు ప్రముఖ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి టైంలో ఆయనకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే ఫోటోలు తీయడానికి వచ్చిన కొంతమంది అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ అయినట్లు ఆ వీడియో సారాంశం.

అసలు విషయంలోకి వెళ్తే..జూనియర్ ఎన్టీఆర్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో తాజాగా ఒక స్టార్ హోటల్ కి వెళ్లారు. ఆ సందర్భంగా తన చుట్టూ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కొంతమంది ఆయన ఫోటోలను తీయడానికి అత్యుత్సాహం చూపించారు. అంతేకాదు ఆయన లుక్ ను ఫోటోలలో బంధించి వైరల్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి ఎన్టీఆర్ వద్దని చెప్పినప్పటికీ ఆయన వెనకాల వెళ్లి ఫోటోలు తీశారు. దీంతో వెంటనే సీరియస్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే ఎన్టీఆర్ వారించినా వినకుండా ఫోటోలు తీయడం వల్లే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

వైరల్ అవుతున్న వీడియో, ఎన్టీఆర్ లుక్

ఇకపోతే గత కొంతకాలంగా బక్క చిక్కిపోయినట్టు కనిపించిన ఎన్టీఆర్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈసారి ఆయన లుక్ చూసి అటు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఇలా తయారయ్యాడేంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ను తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు జీర్ణించుకోలేని కామెంట్స్ తో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. దీంతో అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా యాంటీ ఫ్యాన్స్ పై విరుచుకుపడుతూ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో కోల్డ్ వార్ నడుపుతున్నారు. మొత్తానికైతే ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్రోల్స్, కామెంట్లు: సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్

Instagram lo next mentalodu antunaaru 😂🤣🤣 pic.twitter.com/dq2JYeq4eR

— Allu Babloo AADHF (@allubabloo) January 5, 2026

ఎన్టీఆర్ ఆగ్రహం, ఆయన కొత్త లుక్ రెండూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల అత్యుత్సాహం, సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతపై ఇది చర్చకు దారితీసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వాదనలు కొనసాగుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.