
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీకి శింబు నటించిన ‘పత్తుతల’ చిత్రంలోని ఒక పాట చాలా ఇష్టమని తెలిసింది. ఆ పాటను ఆయన రోజూ వినడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Key Points
విరాట్ కోహ్లీకి శింబు నటించిన 'పత్తుతల' చిత్రంలోని 'నీ సింగం దాన్' పాట చాలా ఇష్టం.
కోహ్లీ ఈ పాటను రోజూ వినడం వల్ల ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
శింబు కోహ్లీని 'నీయే ఒరు సింగం దాన్' అని అభినందించారు.
కోహ్లీ బయోపిక్ లో శింబు నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కోహ్లీకి ఇష్టమైన పాట
భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీది ప్రత్యేక స్థానం. సచిన్, ధోనీల తరువాత ఆ స్థాయి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా నిర్వహించి పేరు గడించారు. విరాట్ కోహ్లీకి అశేష అభిమానులు ఉన్నారు. ఇకపోతే సినిమా రంగంలో సంచలన నటుడు శింబు. ఈయనలో మంచి నటుడే కాకుండా, దర్శకుడు, కథకుడు, సంగీతదర్శకుడు, గాయకుడు ఉన్నారు. అంతేకాకుండా శింబు బహు భాషా నటుడిగా పేరు తెచ్పుకున్నారు. ఇలాంటి నటుడి చిత్రంలోని పాటను క్రీడాకారుడు విరాట్ కోహ్లీ లూప్ మోడ్‌లో(పదేపదే) వినడం విశేషం. నటుడు శింబు 2023లో కథానాయకుడిగా నటించిన చిత్రం పత్తుతల. ఏఆర్.రెహా్మన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ‘నీ సింగం దాన్’ అనే పాట చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ పోటీల్లో బెంగళూరు జట్టు రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడుతున్నారు. ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రంలోని నీ సింగం దాన్ అనే పల్లవితో సాగే పాటను పదేపదే విన్నానని చెప్పారు. ఆయన ఇంటర్వ్యూతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది శింబు దృష్టికి రావడంతో ఆయన కోహ్లీ నుద్దేశించి నీయే ఒరు సింగం దాన్ (నువ్వే ఒక సింహం) అని పేర్కొన్నారు. దీంతో కోహ్లీ అభిమానులు, శింబు అభిమానునలు క్రీడారంగంలోనూ, సినీ రంగంలోనూ ప్రముఖులైన ఇద్దరు ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు.
కోహ్లీ బయోపిక్ ప్రచారం
మరో విషయం ఏమిటంటే శింబు, కోహ్లీలో స్వారూప్యం చాలా ఉంది. ఇద్దరూ చార్మింగ్‌గా ఉంటారు. ఇద్దరూ పొడవైన జుట్టుతో ఉంటారు. దీంతో కోహ్లీ బయోపిక్‌లో శింబు నటించనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకుముందు ధోని బయోపిక్‌తో తెరకెక్కిన ఎంఎస్.ధోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాబట్టి విరాట్ కోహ్లి బయోపిక్ తెరకెక్కే అవకాశం లేకపోలేదని, అందులో శింబు నటిస్తే అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అవుతుందనే వేరే చెప్పాల్సిన అవసరం ఉండదు. శింబు ప్రస్తుతం కమలహాసన్‌తో కలిసి నటించిన థగ్‌లైఫ్ చిత్రం జూన్ 5న తెరపైకి రానుంది. తాజాగా మరో మూడు చిత్రాలకు కమిట్ అయ్యారు. వీటిని పూర్తి చేసిన తరువాతనే కోహ్లీ బయోపిక్‌లో నటించే అవకాశం ఉంటుంది.
విరాట్ కోహ్లీ మరియు శింబు ఇద్దరి మధ్య ఉన్న అభిమానం, కోహ్లీ బయోపిక్ పై ఆసక్తిని పెంచింది. శింబు నటనతో ఈ బయోపిక్ పాన్ ఇండియా హిట్ అయ్యే అవకాశాలున్నాయి.


