
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న జరిగింది.
- మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు.
- రిసెప్షన్‌లో రష్మికకు రక్షణ కవచంలా నిలిచిన విజయ్ దేవరకొండ.
- విజయ్ దేవరకొండ వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు ముగిసాయి. హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రౌడీ హీరో తన భార్య రష్మికను ఎలా కాపాడుకున్నాడో చూడండి.
విజయ్, రష్మికల గ్రాండ్ రిసెప్షన్
Virosh Reception Vijay Devarakonda Protects Rashmika Mandanna: పెళ్లి తర్వాత టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. విరోష్ రిసెప్షన్‌లో భార్య రష్మిక మందన్నాకు రక్షణ కవచంలా ఉండి కాపాడుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆ వీడియో వైరల్‌గా మారింది.
టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నాల (Virosh Wedding) వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఫిబ్రవరి 26న ఒక్కటైన ఈ జంట, బుధవారం (మార్చి 4) రాత్రి హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ (Virosh Reception) ఏర్పాటు చేశారు. ఈ వేడుక ముగిసిన తర్వాత కెమెరా కళ్లకు చిక్కిన ఒక దృశ్యం ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
రష్మికకు రక్షణగా విజయ్ దేవరకొండ
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో
విజయ్ దేవరకొండ, రష్మికల రిసెప్షన్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వారిద్దరి బంధం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


