
📌 Key Points
- ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విరోష్ జంట.
- పెళ్లి తర్వాత ఆలయాల సందర్శన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఈ జంట.
- హైదరాబాద్‌లో మార్చి 4న సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్.
- విజయ్, రష్మికల పెళ్లి ఖర్చు అక్షరాలా 20 కోట్ల రూపాయలు!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగింది. ఆ తర్వాత రిసెప్షన్ కూడా ఘనంగా నిర్వహించారు. అయితే వీరి పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు మీకోసం…
విజయ్, రష్మికల వివాహ వేడుక విశేషాలు
Virosh wedding: రష్మిక మందన్న విజయ్ దేవరకొండ వివాహపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీ ఈ జంట ఉదయ్ పూర్ లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ పెద్ద ఎత్తున ఆలయాలను సందర్శించడం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం తన సొంతూరులో సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు గ్రామస్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మార్చి 4వ తేదీ ఈ జంట హైదరాబాదులో ఎంతో ఘనంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
రష్మిక విజయ్ దేవరకొండ వివాహపు వేడుకలు ఎంతో సాంప్రదాయ బద్దంగా జరిగాయని చెప్పాలి. ముఖ్యంగా వీరి వస్త్రధారణ మాత్రం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సాప్రదాయం ఉట్టిపడేలా విజయ్ రష్మిక ప్రతి వేడుకలో కనిపించి సందడి చేశారు. ఇప్పటివరకు ఏ సెలబ్రెటీ కూడా తమ పెళ్లి వేడుకను పురస్కరించుకొని ఆలయాలలో అన్నదానం చేయడం, అభిమానులకు స్వీట్లు పంచడం, అభిమానులను ప్రత్యేకంగా కలిసి విందు ఏర్పాటు చేయడం వంటివి చేయలేదు. రష్మిక విజయ్ మాత్రం సరికొత్త ఆలోచనలతో అభిమానులకు కూడా మంచి ట్రీట్ ఇచ్చారు.
షాకింగ్.. విరోష్ పెళ్లికి ఎంత ఖర్చయిందో తెలుసా?
ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో వీరి పెళ్లి ఖర్చు ఎంత అయ్యి ఉంటుందనే ఆలోచన కూడా అభిమానులలో ఉంది. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేడుక మొత్తం ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ కి అప్పజెప్పారని తెలుస్తోంది. ప్రతి ఒక్క వేడుకను చాలా దగ్గరుండి వారి అభిరుచులకు అనుగుణంగా నిర్వహించారు. అయితే ఈ పెళ్లి వేడుక కోసం విజయ్ దేవరకొండ రష్మిక ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రీ వెడ్డింగ్ ఆ సెలబ్రేషన్స్ నుంచి మొదలుకొని రిసెప్షన్ వరకు వీరి వివాహపు ఖర్చు 20 కోట్ల రూపాయలు అయినట్టు సమాచారం.
పెళ్లి తర్వాత వెండి తెరపై జంటగా..
సొంత డబ్బుతోనే పెళ్లి చేసుకున్నారా?
ఇలా విరోష్ వెడ్డింగ్ కోసం అయిన ఖర్చు మొత్తాన్ని రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా భరించారని, ఇలా వీరిద్దరూ ఈ పెళ్లి ఖర్చు తమ తల్లిదండ్రులకు సంబంధం లేకుండా వీరి డబ్బుతోనే ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది. ఇక నిన్నటితో వీరి రిసెప్షన్ వేడుక కూడా పూర్తి కావడంతో విజయ్ రష్మిక వివాహపు తంతూ పూర్తి అయింది . ఇక త్వరలోనే ఈ జంట యధావిధిగా సినిమా షూటింగ్స్ లో బిజీ కాబోతున్నారు. విజయ రష్మిక ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రణబాలి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా వెండితెరపై సందడి చేయబోతున్న మొదటి సినిమా కావడం విశేషం. ఇక వీరిద్దరూ ఇదివరకే గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. రణబాలి మూడో సినిమా కావటం విశేషం.
మొత్తానికి విరోష్ జంట తమ పెళ్లిని ఎంతో గ్రాండ్‌గా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ జంట సినిమా షూటింగ్‌లతో బిజీ కానున్నారు.


