
‘హీరో’ సినిమాతో పరిచయమైన గల్లా అశోక్ నటించిన ‘వీసా- వింటారా సరదాగా’ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ చిత్రం అమెరికాలోని తెలుగు విద్యార్థుల జీవితాలను తెరపైకి తీసుకువచ్చింది. స్నేహం, ప్రేమ, సవాళ్లు ఈ చిత్రంలో ప్రధాన అంశాలు.
Key Points
‘వీసా- వింటారా సరదాగా’ చిత్ర టీజర్ విడుదల
అమెరికాలోని తెలుగు విద్యార్థుల జీవితాల నేపథ్యంలో కథ
స్నేహం, ప్రేమ, గందరగోళం, సవాళ్లతో నిండిన ప్రయాణం
గల్లా అశోక్, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులు
‘వీసా- వింటారా సరదాగా’ టీజర్ విడుదల
‘హీరో’(Hero) మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన గల్లా అశోక్(Galla Ashok) మనందరికీ సుపరిచితమే. ఈ యంగ్ హీరో మహేశ్‌బాబు(Mahesh Babu)కు మేనల్లుడు. అయితే ప్రస్తుతం అశోక్ యంగ్ డైరెక్టర్ ఉద్భవ్ డైరెక్షన్‌లో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే శుక్రవారం ఈ చిత్రానికి ‘వీసా- వింటారా సరదాగా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఎన్నో కలలతో అమెరికాలో అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణమే ఈ చిత్ర కథాంశంగా టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక చివరిగా హీరో ఇండియా, అమెరికా ఏదైనా కానీ మెయిన్ ప్రాబ్లం ప్రేమే.. వింటారా నా ప్రేమకథా అంటూ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. కాగా ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. Link
అమెరికా నేపథ్యంలో కథాంశం
స్నేహం, ప్రేమ, సవాళ్లు
చివరిగా హీరో చెప్పిన డైలాగ్ టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. అమెరికాలోని తెలుగు విద్యార్థుల జీవితాలను ఆసక్తికరంగా చిత్రీకరించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.


