|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజేంద్ర ప్రసాద్ క్షమాపణపై విశాల్ రియాక్షన్: ఏం జరిగిందో తెలుసా?

Published: 13-03-2026, 2:35 PM
రాజేంద్ర ప్రసాద్ క్షమాపణపై విశాల్ రియాక్షన్: ఏం జరిగిందో తెలుసా?
  • రాజేంద్ర ప్రసాద్ కాంతారావు స్మారక పురస్కారం అందుకున్నారు.
  • అవార్డు స్వీకరణ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
  • తమిళుల ఆగ్రహంతో రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పారు.
  • రాజేంద్ర ప్రసాద్ క్షమాపణపై విశాల్ స్పందించారు.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక అవార్డు కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ కోరారు. ఈ క్షమాపణపై కోలీవుడ్ నటుడు విశాల్ స్పందించారు.

రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Hero Vishal: భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నటప్రపూర్ణ కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారాన్ని నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) అందుకున్న విషయం తెలిసిందే. అవార్డు అందుకున్న అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నోరు జారిన విషయం తెలిసిందే. అందుకుగానూ ఆయన క్షమాపణలు కోరుతూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో విడుదల అనంతరం తాజాగా కోలీవుడ్ నటుడు విశాల్ కూడా ఓ వీడియోను విడుదల చేసి, రాజేంద్ర ప్రసాద్ సారీపై రియాక్టయ్యారు. కాంతారావు (Kantha Rao), ఎంజీఆర్‌ (MGR)లను పోలుస్తూ.. రాజేంద్ర ప్రసాద్ పదే పదే మాట్లాడకూడని ఓ మాటను స్టేజ్‌పై మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన తమిళులు, వెంటనే సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ల డిమాండ్ తర్వాత, తన తప్పు తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ తమిళ్‌లోనే సారీ చెప్పి, వారిని శాంతపరిచారు. రాజేంద్ర ప్రసాద్ చెప్పిన సారీపై విశాల్ (Hero Vishal) స్పందిస్తూ..

‘‘నమస్తే రాజేంద్ర ప్రసాద్ సార్.. మీరు సారీ చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ సార్. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు ఎంజీఆర్‌‌పై మాట్లాడిన వీడియో వచ్చిన తర్వాత చాలా మంది మా లాంటి జనరేషనే కాకుండా చాలా మంది ఆయనతో ప్రయాణం చేసిన వాళ్లంతా వచ్చి ఎంతో బాధపడ్డారు. ఆ తర్వాత మేము సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్ పెట్టాం. బికాజ్ ఇట్ హర్ట్ ఏ లాట్ ఆఫ్ పీపుల్స్ సెంటిమెంట్స్.. త్రూ అవుట్ నాట్ ఓన్లీ తమిళనాడు, త్రూ అవుట్ ది వరల్డ్.. అందుకే మిమ్మల్ని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాం. నిజంగా చెప్పాలంటే మీలాంటి పెద్ద నటుల గురించి కూడా రేపు ఎవరైనా తప్పుగా మాట్లాడితే.. మేము ఇలాగే రియాక్ట్ అవుతాం.

విశాల్ స్పందన

ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి మేము. ఎందుకంటే, చెప్పిన వెంటనే మీరు అది మైండ్‌లో పెట్టుకొని, యాక్సెప్ట్ చేసి అపాలజీ చెప్పడం నిజంగా గ్రేట్ సార్. థాంక్యూ సో మచ్ సార్.. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది అడ్మైరర్స్, ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్. నిజంగా మీరు గొప్ప మనిషి సార్. ఎందుకంటే, మీలాంటి స్థాయి వారు దీనిని అసలు పట్టించుకోరు. ఇలా సారీ చెప్పాలనే ఆలోచన చాలా మందికి రాదు. మీరు అది మనసారా ఆలోచించి చెప్పినందుకు నిజంగా మీకు ఐ రియల్లీ థాంక్ యు సార్..’’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘దీనికి థ్యాంక్యూ చెప్పడం ఎందుకు, ఆయన తప్పుగా మాట్లాడారు కాబట్టి.. సారీ చెప్పారు’ అంటూ నెటిజన్లు కొందరూ విశాల్ వీడియోకు రియాక్ట్ అవుతున్నారు.

రాజేంద్రప్రసాద్‌ క్షమాపణలు.. హీరో విశాల్ రియాక్షన్ ఇదే! pic.twitter.com/hNCznigSHR

క్షమాపణ చెప్పిన రాజేంద్ర ప్రసాద్

— ChotaNews App (@ChotaNewsApp) March 13, 2026

రాజేంద్ర ప్రసాద్ తన తప్పును తెలుసుకొని వెంటనే క్షమాపణ చెప్పడం గొప్ప విషయమని విశాల్ అన్నారు. ఇలాంటి విషయాల్లో అందరూ స్పందించాలని ఆయన కోరారు. ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.