
తాజాగా, మంచు విష్ణు చేసిన ట్వీట్ నెటిజన్లను కోప్పొందించింది. ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతున్న సమయంలో, విష్ణు తన ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్ల గురించి ట్వీట్ చేయడం వారికి అర్థం కాలేదు.
Key Points
మంచు విష్ణు తన కొత్త సినిమా 'కన్నప్ప' ప్రమోషన్ల గురించి ట్వీట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్‌పై స్పందించకపోవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విష్ణు మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌ను, 'కన్నప్ప' సినిమాలో తాను చేసిన స్టంట్ వర్క్‌ను హైలైట్ చేశారు.
నెటిజన్లు విష్ణు ట్వీట్‌ను ట్రోల్ చేస్తూ, రాళ్లతో కొడతామని బెదిరిస్తున్నారు.
మంచు విష్ణు ట్వీట్ వైరల్
ఏప్రిల్ నెలలో జరిగిన ఉగ్రదాడిలో భారత్‌కు చెందిన 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అక్కడి అందమైన ప్రదేశాలను చూసేందుకు వెళ్లిన వారిని ఉగ్రవాదులు దారుణంగా చంపేశారు. అయితే పహల్గాం దాడికి ఆపరేషర్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు భారత్ బదులివ్వనుంది. టెర్రరిస్టుల స్థావరాలపై నిప్పులు కురిపించింది. అయితే ఈ దాడిలో 80 మందికి పైకా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో పాటు ఇండయా వాల్లు న్యూ ఇండియాను చూస్తారని కూడా పాకిస్తాన్ వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. గత కొద్ది గంటల నుంచి ఎక్కడ చూసిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఆపరేషన్ సిందూర్ యావత్ భారతీయులు స్పందిస్తూ తమ అభ్రిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నాయి.
నెటిజన్ల ఆగ్రహం
అదే విధంగా ఈ విషయంపై సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇండియాలో పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు అని పలువురు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా యావత్ భారతీయులు ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎలాంటి సిచ్చ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో అని బిక్కు బిక్కు మంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మంచు విష్ణు(Vishnu Manchu) ఓ ట్వీట్ చేసి ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఆపరేషర్ సిందూర్ గురించి స్పందించకుండా తన ‘కన్నప్ప’ (Kannappa)సినిమా గురించి వరుస పోస్టులు పెట్టడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు అందులో ఏముందంటే.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో నెలరోజుల ముందు నుంచే ఆయన యూఎస్‌లో ప్రమోషన్స్ చేయడానికి టూర్ వెళ్తున్నట్లు ప్రకటించారు.
‘కన్నప్ప’ ప్రమోషన్లు
మే 8న న్యూ జెర్సీ సాయంత్రం 7:30 గంటలకు ఈవెంట్ నిర్వహించనున్నారు. అలాగే మే 9న డల్లాస్, మే 10న బే ఏరియాలో ఉదయం 10:30లో ప్రమోషన్స్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా షూటింగ్ వీడియోను షేర్ చేస్తూ ‘‘చాలా మందికి తెలియదు.. నేను నటుడిని కావడానికి ముందు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాను. అంతేకాకుండా LAలో స్టంట్‌మ్యాన్‌గా పనిచేశాను. నేను తెలుగు స్టంట్ యూనియన్ సభ్యుడిని అని గర్వంగా చెప్పగలను. కన్నప్ప షోరన్నర్‌గా, చాలా యాక్షన్ సన్నివేశాలను నేనే డిజైన్ చేశాను. వాటిని ప్రాణం పోసుకున్నందుకు కెచా మాస్టర్‌కు చాలా ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్టులు చూసిన నెటిజన్లు దేశవ్యాప్తంగా ఆపరేషన్ సిందూర్ గురించి స్పందిస్తుంటే నువ్వు ఇలాంటి పోస్ట్ పెట్టడం అవసరమా.. రాళ్లతో కొడతారు అని తిడుతున్నారు. అలాగే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నువ్వు.. ఈ సమయంలో కన్నప్ప గురించి చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అంత పెద్ద ఇష్యూ గురించి వదిలేసి తప్పు చేశావని అంటున్నారు.
మంచు విష్ణు యొక్క ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ సిందూర్ నీడలో సినిమా ప్రమోషన్లు చర్చకు దారితీశాయి. నెటిజన్ల ప్రతిస్పందన ఆసక్తికరంగా ఉంది.


