
📌 Key Points
- ‘విష్ణు విన్యాసం’ సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిర్మాతల నమ్మకం.
- శ్రీ విష్ణు కామెడీ టైమింగ్, డైలాగ్ ఇంప్రవైజేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాతలు తెలిపారు.
- ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
- రెండు వేర్వేరు జానర్ల సినిమాలు కావడంతో ప్రేక్షకులు థియేటర్లలో వినోదం పొందుతారని నిర్మాతల ఆశాభావం.
శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో చూస్తారని నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు, సుమంత్ నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఇదే పెద్ద విడుదల కానుంది.
ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకొస్తారు?
Vishnu Vinyasam: ఈ మధ్యకాలంలో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులకు థియేటర్లకు రావడం లేదనేలా టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సినిమాల తర్వాత విడుదలైన సినిమాలేవీ సందడి చేయకపోవడానికి కారణం కూడా ఇదేనని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మా సినిమా ‘విష్ణు విన్యాసం’ చూడటానికి తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అంటున్నారు చిత్ర నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు జి (Subramanyam Naidu G), సుమంత్ నాయుడు జి (Sumanth Naidu G). కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) నటించిన హిలేరియస్ జాయ్‌రైడ్ ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam). యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా మీడియాకు నిర్మాతలు చిత్ర విశేషాలను తెలిపారు.
శ్రీ విష్ణు నటనపై నిర్మాతల ప్రశంసలు
‘‘కామెడీ కథలెప్పుడూ కూడా విన్నప్పటి కంటే స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాతనే కథలో ఉన్న వినోదం ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. మా వరకు ఈ కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో.. చూసినప్పుడు కూడా అంతే అంతకుమించి ఆస్వాదించాము. సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీ విష్ణు చాలా డైలాగ్స్‌ని స్పాట్‌లో ఇంప్రవైజ్ చేస్తుంటారు. అవన్నీ కూడా ఇందులో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ కాపీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము అనుకున్నది స్క్రీన్ మీద అద్భుతంగా కన్వే అయింది. శ్రీ విష్ణు ఈ సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు సినిమాలు ఒకేసారి రావలసిన పరిస్థితి వచ్చింది. అయితే వన్ వీక్ గ్యాప్‌లో ముందుగా కామెడీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చి, ఆ తర్వాత థ్రిల్లర్ జానర్ సినిమా తీసుకురావాలని సన్నాహాలు చేశారు. ఈ విషయంలో ఆయన సపోర్ట్ మర్చిపోలేము. రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు కావడంతో ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.
ఫిబ్రవరి 27న విడుదల: అంచనాలు
ఒక మంచి సినిమా ఇస్తే ఆడియన్స్ కచ్చితంగా థియేటర్స్‌కి వస్తారని మేము నమ్ముతున్నాం. సంక్రాంతి తర్వాత సినిమాలు కూడా తక్కువగా రావడం జరిగింది. మా ‘విష్ణు విన్యాసం’ సినిమాకి ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే ఇందులో ఉన్న కంటెంట్ అలాంటిది. సినిమా చూసిన ఆడియన్స్ ఒక చిరునవ్వుతో థియేటర్స్ నుంచి బయటికి వస్తారని హామీ ఇవ్వగలం. ఈ సినిమా శ్రీ విష్ణు కెరియర్‌లో టాప్ ఫైవ్ సినిమాలో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమాతో ఆయన సక్సెస్ ట్రాక్ కొనసాగుతుంది. శ్రీ విష్ణుతో భవిష్యత్తులో కూడా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇది హీరో క్యారెక్టర్ మీద నడిచే కథ. దానితో పాటు మరో ఇంట్రెస్టింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హీరో క్యారెక్టర్‌కి న్యూమరాలజీ అంటే నమ్మకం. ఆ క్యారెక్టర్ ఆద్యంతం అలరించేలా ఉంటుంది. అలాగే హీరోయిన్ ట్రాక్, రెండు ఫ్యామిలీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కామెడీ పక్కాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ యూత్ కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ యూత్, ఫ్యామిలీని ఇద్దరినీ అలరిస్తుంది’’ అని నిర్మాతలు చెప్పుకొచ్చారు.
కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ‘విష్ణు విన్యాసం’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని, థియేటర్లకు తప్పకుండా వస్తారని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల కోసం ఎదురుచూడండి.


