|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిహారిక ‘రాకాస’ మూవీ బ్లాక్ బస్టర్ టాక్! మెగా ఫ్యాన్స్ కు పూనకాలే!!

Published: 02-04-2026, 2:05 PM
నిహారిక 'రాకాస' మూవీ బ్లాక్ బస్టర్ టాక్! మెగా ఫ్యాన్స్ కు పూనకాలే!!
  • నిహారిక ‘రాకాస’ మూవీకి అదిరిపోయే రివ్యూ.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
  • సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ల నటనకు ప్రేక్షకులు ఫిదా!
  • వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను వినోదంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి.
  • క్లైమాక్స్ అదిరింది.. నిహారిక ఖాతాలో మరో హిట్ పక్కా!

మెగా డాటర్ నిహారిక నిర్మాతగా మారి ‘రాకాస’ మూవీతో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

నిహారిక ‘రాకాస’ మూవీ రివ్యూ అదుర్స్!

హీరోయిన్‌గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక.. నిర్మాతగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి మొదటి చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ తీసుకొచ్చింది. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు అదే క్రేజ్‌తో సెకండ్ చిత్రం ‘రాకాస’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నది. జీ స్టూడియోస్ స‌మ‌ర్పణలో ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిర్మిస్తున్న ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించగా.. సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రం రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రీమియర్ షోలు ఇప్పటికే పడగా.. రాకాస రివ్వూ కూడా వచ్చేంది.

మరి సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే.. ‘సరదాగా సాగే ప్రథమార్ధం (First Half), ఒక మంచి సన్నివేశంతో ముగిసే విరామం, అలాగే చక్కటి కథాంశంతో కూడిన అద్భుతమైన ద్వితీయార్థం (Second Half). సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను అత్యున్నత స్థాయి వినోదాన్ని అందించారు. నయన్ సారిక నటన బాగుంది. క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంది.. నిహారిక కొణిదెల ఖాతాలో మరో విజయం చేరింది. అనుదీప్ అందించిన సంగీతం బాగుంది, అలాగే నేపథ్య సంగీతం (RR) అయితే అద్భుతం. ఈ వారాంతంలో తప్పక చూడాల్సిన చిత్రం.. అంతే కాదు రాకాస 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో పలు రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

సంగీత్, సారిక నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు!

క్లైమాక్స్ అదిరింది.. హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్!

నిహారిక ‘రాకాస’ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.