|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vishnupriya : బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలని ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి వచ్చిందట.. విష్ణుప్రియ స్టోరీ భలే ఉందే..

Published: 25-05-2025, 1:33 PM
Vishnupriya : బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలని ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి వచ్చిందట.. విష్ణుప్రియ స్టోరీ భలే ఉందే..

యాంకర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ తన ఎంటర్టైన్మెంట్ రంగ ప్రయాణాన్ని పంచుకుంది. బాయ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో షార్ట్ ఫిలిం చేసింది. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మారిందో తెలుసుకుందాం.

Key Points

1

బాయ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో షార్ట్ ఫిలిం చేసింది.

2

ఆ షార్ట్ ఫిలిం ద్వారా యాంకరింగ్ అవకాశం లభించింది.

4

విష్ణుప్రియ తల్లి సినీ పరిశ్రమలో హెయిర్ స్టైలిస్ట్ గా, తాత నాటకాలలో నటించేవారు.

బాయ్‌ఫ్రెండ్ గిఫ్ట్ కోసం ఎంట్రీ

Vishnupriya : యాంకర్ గా ఫేమ్ తెచ్చుకున్న విష్ణుప్రియ తర్వాత బిగ్ బాస్, టీవీ షోలు, సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంటుంది. ఇక తన సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది విష్ణుప్రియ. ఈ ఇంటర్వ్యూలో తను ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చిందో చెప్పింది.

విష్ణుప్రియ మాట్లాడుతూ.. నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలని డబ్బుల కోసం ఒక షార్ట్ ఫిలిం చేశాను. ఆ షార్ట్ ఫిలిం తర్వాత పలు అవకాశాలు వచ్చాయి. అలా ఫన్ బకెట్ చేశాను. దాంట్లో అందర్నీ నవ్వించాను. నాకు నవ్వించడం ఇష్టం. అందుకే అది చేశాను. దాంతో కొన్ని యూట్యూబ్ వీడియోల ఛాన్సులు వచ్చాయి. అది చూసే పోవే పోరా ఆడిషన్ కి పిలిచారు. అక్కడ యాంకర్ గా చేశా. అక్కడ్నుంచి అందరికి తెలిసిందే అని చెప్పింది.

షార్ట్ ఫిలిం నుంచి యాంకరింగ్ వరకు

విష్ణుప్రియ కుటుంబ నేపథ్యం

అయితే విష్ణుప్రియ తల్లి సినీ పరిశ్రమలో కొన్నాళ్ళు హెయిర్ స్టైలిస్ట్ గా చేసింది. విష్ణుప్రియ తాత కూడా నాటకాలు వేసేవారని ఇంటర్వ్యూలో తెలిపింది.

విష్ణుప్రియ యొక్క ఈ అనుభవం చాలా ఆసక్తికరంగా ఉంది. తన లక్ష్యం సాధించడానికి ఎంచుకున్న మార్గం ఆమెకు ఎంతో విజయం సాధించడంలో సహాయపడింది. ఆమె భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.