
📌 Key Points
- విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కల్ట్’.
- సినిమాలో మొదటి 45 నిమిషాలు హీరో కనిపించకుండా సస్పెన్స్ ఉంటుందట.
- ఇది ఇండియాలోనే మొట్టమొదటి స్లాషర్ సినిమాగా చెబుతున్నారు.
- కుటుంబాలు, పిల్లలు, బలహీన హృదయులు ఈ సినిమా చూడకపోవడం మంచిదని విశ్వక్ సేన్ హెచ్చరించారు.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘కల్ట్’ చిత్రం సంచలనాలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మొదటి 45 నిమిషాలు హీరో కనిపించకుండా ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కల్ట్ సినిమా కథాంశం ఏంటి?
Vishwak Sen Cult : తెలుగు సినిమాల్లో మరో సంచలన ప్రయోగానికి సిద్ధమవుతున్నారు విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటిస్తూ..దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా కల్ట్ ఇప్పటికే షాకింగ్ అంశాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
కల్ట్ కథ ఒక భయంకరమైన ఆట చుట్టూ తిరుగుతుంది. ఒక పార్టీ హోస్ట్ చాలా హుషారుగా పార్టీని ఏర్పాటు చేస్తాడు. మొదట అంతా సరదాగా కనిపించినా, క్రమంగా ఆ పార్టీ భయానకంగా మారుతుంది. అక్కడ ఉన్న అతిథులు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. బయటకు తప్పించుకునే మార్గం ఉండదు. బతకడమే ఒకే ఒక నిబంధనగా మారుతుంది.
ఈ గందరగోళ పరిస్థితుల్లో “గేమ్ మాస్టర్” అనే రహస్య వ్యక్తి కథలోకి వస్తాడు. అతను నిజంగా అందరిని కాపాడటానికి వచ్చాడా? లేక మరింత పెద్ద ప్రమాదమా? అనే సందేహమే సినిమాకి ప్రధాన సస్పెన్స్. ఈ ప్రశ్న చుట్టూనే కథ మొత్తం సాగుతుంది.
విశ్వక్ సేన్ హెచ్చరికలు
ఈ సినిమాతో విశ్వక్ సేన్ భారతీయ సినిమాల్లో చాలా అరుదైన జానర్‌ను టచ్ చేస్తున్నారు. కల్ట్ ను ఇండియాలో తొలి నిజమైన స్లాషర్ సినిమాగా చెబుతున్నారు. నిజ జీవిత ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ సినిమా చాలా రా, భయానకంగా, రక్తపాతం ఎక్కువగా ఉండేలా రూపొందించారట. ఇది సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదని గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతుంది.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “ఫ్యామిలీస్ ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిది. పిల్లలను ఈ సినిమాకు తీసుకురావద్దు. బలహీన హృదయులు ఈ సినిమాను చూడకపోవడం మంచిది” అని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. ఈ మాటలే సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
సినిమాలో షాకింగ్ ట్విస్ట్
ఇది దర్శకుడిగా విశ్వక్ సేన్‌కు మూడో సినిమా. ఎప్పుడూ కొత్త కథలు, కొత్త ప్రయోగాలతో ముందుకు వెళ్లే ఆయన మరో షాకింగ్ ట్విస్ట్‌ను వెల్లడించారు. ఈ సినిమాలో మొదటి 45 నిమిషాల పాటు హీరో స్క్రీన్‌పై కనిపించడు. అయినా కూడా ఆ సమయంలో తన వాయిస్ వినిపించేలా ప్లాన్ చేశానని ఆయన తెలిపారు. ఆవేశం సినిమాలో లాగా ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా మొదట 45 నిమిషాలు హీరో కనిపివ్వరని చెప్పకు వచ్చారు.
విశ్వక్ సేన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆయన తెలిపారు. మొదటి 45 నిమిషాలు హీరో కనిపించకుండా కథనం ఆసక్తికరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.


