
📌 Key Points
- విశ్వక్ సేన్ కొత్త సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
- యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కీలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
- దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
- విశ్వక్ సేన్ ఇప్పటికే లెగసీ, కల్ట్ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.
విశ్వక్ సేన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్లాప్ డైరెక్టర్ రజత్ రవిశంకర్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుండటం విశేషం. మరి ఈ సాహసం ఫలిస్తుందో లేదో చూడాలి.
ప్లాప్ డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ మూవీ: రిస్క్ ఫలిస్తుందా?
Vishwak Sen: ఫంకీతో పత్తాలేకుండా పోయిన విశ్వక్ సేన్ తాజాగా మరో సినిమాకి ముహూర్తం పెట్టాడు.అనురాగ్ కశ్యప్ వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసి కార్తీ ‘దేవ్’ సినిమాతో డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టిన రజత్ రవిశంకర్ దర్శకత్వంలో కొత్త సినిమాకి ముహూర్తం పెట్టాడు.అయితే దీనిని మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ యువసుధ ఆర్ట్స్ పై మిక్కీలినేని సుధాకర్ నిర్మిస్తుండటం కాస్త ఆశ్చర్యమే.ఎందుకంటే దేవర వంటి సాలిడ్ సక్సెస్ హిట్ ఇచ్చిన ఈ బ్యానర్ మరో టాప్ హీరోతో సినిమా చేస్తుందనుకుంటే వరుస ప్లాపుల్లో ఉన్న విశ్వక్ తో చేస్తుండటమే ఇక్కడ గమనార్హం.
ఏడేళ్లు ఖాళీగా ఉన్న డైరెక్టరే దిక్కా?
మరో వైపు కార్తీతో చేసిన తొలి సినిమా దేవ్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డదే.అది రజత్ రవిశంకర్ పై ఎంతలా ఎఫెక్ట్ చూపించిందంటే ఆ సినిమా తర్వాత దాదాపు ఏడేళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయేంతగా.మరి అలాంటిది ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే కథలోని కంటెంట్ ఏ రేంజ్ లో మేకర్స్ ని మెప్పించి ఉంటుందో అని కొందరు అంటుంటే, అసలే ప్లాపుల్లో ఉన్న జోడీ కలిసి ఈ బడా బ్యానర్ ని ముంచేయరు కదా అంటూ మరికొంత మంది నెగెటివ్ కామెంట్స్ వదులుతున్నారు.
యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమా సక్సెస్ అవుతుందా?
కొరటాల శివ వచ్చినా.. కంటెంట్ లో దమ్ముందా?
ఇక తాజాగా జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకుడు కొరటాల శివ హాజరై క్లాప్ ఇవ్వగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్ ను అందజేయడం విశేషం.ఇక ఈ బ్యానర్ లోనే కొరటాల దేవరని తెరకెక్కించిన సంగతి తెల్సిందే.ఏది ఏమైనా ఎవరు సపోర్ట్ చేసినా ఫైనల్ గా కథలో కంటెంట్ లేకపోతె మాత్రం మరో ఫంకీలా మిగిలిపోవడం ఖాయం.మెగా ఫోన్ పక్కన పెట్టి చాలా కాలమైన రజత్ రవిశంకర్, విశ్వక్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కథను సిద్ధం చేశారా?లేక మళ్ళీ పాత కాలపు రొమాంటిక్ కామెడీతో బోర్ కొట్టిస్తారా?అన్నది చూడాలి మరి.
విశ్వక్ సేన్ కెరీర్‌కు ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది?
క్వాలిటీ కన్నా క్వాంటిటీకే ఇంపార్టెన్స్?
ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే ఇప్పటికే లెగసీ, కల్ట్ అంటూ రెండు సినిమాలు సెట్స్ మీద పరుగులు పెడుతున్నాయ్.మరి అసలే గ్యాంగ్ ఆఫ్ వస్సీపూర్, లైలా, ఫంకీ అంటూ వరుస ప్లాప్ సినిమాలతో డౌన్ ఫాల్ లో ఉన్నాడు విశ్వక్ .అలాంటిది సెట్స్ పై ఉన్న సినిమాలపైనే ఫోకస్ చేసి హిట్ కొట్టాల్సింది పోయి ఇపుడు మరో సినిమాని మొదలెట్టడం చూస్తుంటే క్వాలిటీ కన్నా కంటెంట్ కన్నా క్వాంటిటీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్. మరో వైపు విశ్వక్ ట్రాక్ రికార్డ్ చూసి విశ్వక్ భయ్యా..ఇలా అయితే ఇండస్ట్రీకి బాయ్ బాయ్ చెప్పడం పక్కా అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.మరి బడా బ్యానర్ అండతో అయినా ఈ దేవ్ డైరెక్టర్, మాస్ కా దాస్ ను ఆదుకుంటాడో లేదో కాలమే డిసైడ్ చేయాలి.
మొత్తానికి విశ్వక్ సేన్ ప్లాప్ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తున్నాడు. ఈ సినిమా అతని కెరీర్‌ను మారుస్తుందో లేదో వేచి చూడాలి. క్వాలిటీ కన్నా క్వాంటిటీకే ప్రాధాన్యత ఇస్తున్నాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


