
📌 Key Points
- ప్రతి సినిమాకు 20 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్న అల్లు అర్జున్.
- అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ద్వారా సేవా కార్యక్రమాలు.
- రెండు తెలుగు రాష్ట్రాలలో AAFA కమిటీల ఏర్పాటు.
- అభిమానుల కోసం ప్రత్యేకంగా యూనిటీ ఉండాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానుల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన ప్రతి సినిమాకు 20 టికెట్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఈ మధ్య ఫ్యాన్స్ అంటూ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ‘ప్రతి సంవత్సరం ఒక మంచి పని’ సందేశాన్ని ముందుకు తీసుకెళుతూ సమాజంలో సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) పేరిట కమిటీల ఏర్పాటు జరుగుతోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ అసోసియేషన్‌కు కమిటీలను ఏర్పాటు చేస్తూ.. ఎప్పటికప్పుడు ఎవరెవరు నియామకం అయ్యారో చెబుతున్నారు. మరి ఇలా ఎన్నికైన వారి కోసమో, లేదంటే తన ఇతర అభిమానుల కోసమో తెలియదు కానీ, అల్లు అర్జున్ ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకున్నారట. అల్లు అర్జున్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో కొంతకాలంగా అంతా ఆశ్చర్యపోతూ చూస్తూనే ఉన్నారు. మెగా ట్యాగ్ వదిలి ‘అల్లు ఆర్మీ’ (Allu Army) పేరిట తన దారిలో తను నడుస్తున్నారు.
ప్రతి సినిమాకు 20 ఉచిత టికెట్లు
అందుకే ఇప్పుడు ఫ్యాన్స్, ఆర్మీ అంటూ తనకంటూ ఓ స్టేజ్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఆయనకు స్టేజ్, స్టార్ ఇమేజ్ లేక కాదు.. ముందు ముందు ఆయన తీసుకునే స్టెప్స్‌పై ఫ్యాన్స్ పరంగా సెపరేట్ యూనిటీ ఉండాలని భావిస్తున్నట్లున్నారు. అందుకే, ఇంకాస్త ఫ్యాన్స్‌లో చోటు సంపాదించుకునేందుకు.. ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకున్నారనేలా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అదేంటంటే.. ఇకపై తన నుంచి విడుదలయ్యే ప్రతి సినిమాకు 20 టికెట్లు ఉచితంగా ఇవ్వబోతున్నారట. ప్రతి సెంటర్‌లో కోర్ గ్రూప్ ఫ్యాన్స్‌కు 20 టికెట్ల చొప్పున ఉచితం (20 Tickets Free)గా ఇవ్వాలని అల్లు అర్జున్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. నిజంగా ఇది మంచి నిర్ణయమా? కాదా? అనేది పక్కన పెడితే.. అభిమానుల గురించి ఆయన ఆలోచిస్తున్న తీరుపై మాత్రం ప్రశంసలు కురుస్తున్నాయి. అల్లు సినిమాస్ పేరిట ఇప్పటికే అతి పెద్ద మల్టీ ఫ్లెక్స్‌ని అల్లు ఫ్యామిలీ ప్రారంభించి వార్తలలో నడుస్తుంటే.. ఇప్పుడీ వార్తతో ఫ్యాన్స్ అల్లు అర్జున్ పేరును ట్రెండ్ చేస్తున్నారు.
అభిమానులపై అల్లు అర్జున్ ప్రత్యేక దృష్టి
మరో వైపు అల్లు అర్జున్ ఈ మూవ్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ సమాహారం చేస్తోంది ఫ్యాన్స్‌ని కాదు, ఉద్యోగులని అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సినిమా విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్ట్‌లు పెట్టేందుకు, వేరే వాళ్ల సినిమా విడుదలైనప్పుడు నెగిటివిటీని స్ర్పెడ్ చేయడానికి.. కావాలని ఇలా అల్లు అర్జున్ కొందరినీ అపాయింట్ చేసుకుంటున్నారని, అందుకే.. ఎప్పుడూ లేనిది ఈ మధ్య అంత హడావుడి చేస్తున్నారనేలా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సినిమాను కిల్ చేస్తున్న వాటిలో సోషల్ మీడియా కూడా ఒకటి. సోషల్ మీడియాలో బలంగా ఉంటేనే.. అనేలా ప్రజంట్ సిచ్యుయేషన్ మారిపోయింది. అన్నింటిలో కాస్త అడ్వాన్స్‌డ్‌గా ఉండే అల్లు అర్జున్ ఇలా, సోషల్ మీడియా కోసమే ఫ్యాన్స్, మంచి పని అంటూ కథలు చెబుతున్నారని యాంటీ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. చూద్దాం మరి.. దీనిపై బన్నీ కౌంటర్ ఎలా ఉంటుందో..
అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల్లో ఆనందం నింపుతోంది. అయితే, కొందరు విమర్శకులు దీనిని ఉద్యోగాల కోసమే చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


