|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’: టీజర్ విడుదల! 40 ఏళ్ల సూర్యకు 20 ఏళ్ల ప్రేమ?

Published: 16-03-2026, 8:05 AM
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్': టీజర్ విడుదల! 40 ఏళ్ల సూర్యకు 20 ఏళ్ల ప్రేమ?
  • సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం తెరకెక్కింది.
  • ఈ సినిమాలో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, 20 ఏళ్ల హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు.
  • రాధిక సూర్య తల్లి పాత్రలో నటించగా, రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
  • చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ద్వారా సూర్య షూటర్ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా 40 ఏళ్ల వయసులో 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడటం ఆసక్తికరంగా ఉంది.

విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ విశేషాలు

Vishwanth And Sons Teaser: సూర్య హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేశారు. ఈ టీజర్ తెలుగు తమిళ భాషలలో విడుదల కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇందులో సూర్య షూటర్ గా కనిపించబోతున్నారని టీజర్ ద్వారా స్పష్టమవుతుంది. మనం గొప్ప అనుకున్న ప్రతిసారి మన కన్నా గొప్ప వాళ్ళు ఉంటారు అంటూ దేవుడు గుర్తు చేస్తాడనే డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో సూర్య 40 సంవత్సరాలు వయసు ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి కాకుండా ఉంటారని ఈయన 40 సంవత్సరాలు వయసులో ఉండగా 20 సంవత్సరాల వయసు ఉన్న హీరోయిన్ ప్రేమ పెళ్లి అంటూ వెంట పడుతుందని టీజర్ ద్వారా సినిమా కథ మొత్తం చెప్పకనే చెప్పేశారు. తనకంటే వయసులో చిన్నదైన హీరోయిన్  ప్రేమలో పడటం ఇష్టంలేని విశ్వనాథ్ తనని పెళ్లి చేసుకున్నారా అనే నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య తల్లిగా సీనియర్ నటి రాధిక నటించారు. మొత్తానికి ఒక ఫ్యామిలీ ఎమోషన్ యాక్షన్ డ్రామగా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది.

సూర్య, మమిత బైజుల ప్రేమ కథ

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవినా టాండన్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి ఇక ఈ సినిమాని జూలై నెలలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో వెంకి అట్లూరి తెలుగు హీరోలతో కాకుండా ఇతర భాష హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లక్కీ భాస్కర్, సార్ వంటి సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక ఇప్పుడు సూర్యతో విశ్వనాధ్ అండ్ సన్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పాటలు కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్ గా సందడి చేశారు. ఇటీవల కాలంలో సూర్య సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి ఇక ఈయన చివరిగా రెట్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. మరి సూర్యకు విశ్వనాథన్ అండ్ సన్స్ ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు

మొత్తానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఒక ఫ్యామిలీ ఎమోషన్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది. సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూలైలో విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.