|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Viswant Duddumpudi: పెళ్లయి ఆరు నెలలు.. టాలీవుడ్‌ హీరో వెడ్డింగ్‌ ఫోటోలు చూశారా?

Published: 15-08-2025, 4:20 AM
Viswant Duddumpudi: పెళ్లయి ఆరు నెలలు.. టాలీవుడ్‌ హీరో వెడ్డింగ్‌ ఫోటోలు చూశారా?

‘కేరింత’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన విశ్వంత్ దుద్దుంపూడి, ఈ ఏడాది ఫిబ్రవరి 14న భావనను వివాహం చేసుకున్నాడు. పెళ్లయి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా, తాజా వెడ్డింగ్ ఫోటోలను అతడు షేర్ చేశాడు.

Key Points

1

విశ్వంత్ దుద్దుంపూడి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

2

ఆరు నెలల క్రితం భావనతో వివాహం

4

జెర్సీ, గేమ్ ఛేంజర్ లాంటి చిత్రాల్లో నటించాడు

విశ్వంత్ దుద్దుంపూడి – కెరీర్ ప్రస్తావన

‘కేరింత’ సినిమాతో వెండితెరపై తళుక్కుమని మెరిశాడు విశ్వంత్‌ దుద్దుంపూడి ( Viswant Duddumpudi ). ఓ పిట్ట కథ, క్రేజీ క్రేజీ ఫీలింగ్‌, తోలు బొమ్మలాట, బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌, కథ వెనుక కథ, నమో, హైండ్‌ అండ్‌ సీక్‌ చిత్రాల్లో హీరోగా నటించాడు. జెర్సీ, గేమ్‌ ఛేంజర్‌ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించాడు.

ఆరు నెలల కిందట పెళ్లి తాజాగా అతడు తన పెళ్లి ఫోటోలు షేర్‌ చేశాడు. గతేడాది ఆగస్టులో భావన అనే అమ్మాయితో విశ్వంత్‌ నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజునే భావనను పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం షేర్‌ చేశాడు. తన పెళ్లయి ఆరునెలలు అవుతుండటంతో తాజాగా మరోసారి తన పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు.

ఆరు నెలల వార్షికోత్సవం

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన హీరో భావన & విశ్వంత్‌.. ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే చూపులోనే ఓ రకమైన ప్రశాంతత.. నువ్వు నాకెప్పటినుంచో తెలుసన్న భావన.. ఇద్దరి చిరునవ్వులు సహజంగానే కలిసిపోయాయి! అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వైరల్ అవుతున్న ఫోటోలు

విశ్వంత్ దుద్దుంపూడి మరియు భావనల పెళ్లి ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వారి సంతోషకరమైన క్షణాలను వారు పంచుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.