|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ది ఢిల్లీ ఫైల్స్‌’ టైటిల్‌ను మార్చేసిన దర్శకుడు

Published: 10-06-2025, 3:52 AM
'ది ఢిల్లీ ఫైల్స్‌' టైటిల్‌ను మార్చేసిన దర్శకుడు

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది ఢిల్లీ ఫైల్స్’ చిత్రం టైటిల్ మార్పు గురించి తాజా వార్తలు వెలువడ్డాయి. దర్శకుడు ఈ మార్పుకు కారణాలను వెల్లడించలేదు కానీ, చాలామంది కోరిక మేరకే టైటిల్ మార్చినట్లు తెలిపారు.

Key Points

1

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న 'ది ఢిల్లీ ఫైల్స్' సినిమా టైటిల్ మారింది.

2

సినిమా టైటిల్ 'ది బెంగాల్ ఫైల్స్' గా మార్చారు.

4

మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ నటించారు.

‘ది ఢిల్లీ ఫైల్స్’ టైటిల్ మార్పు

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’(2022) సినిమాతో  దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి(Vivek Agnihotri). ఈ సినిమా తర్వాత ఆయన ‘ది ఢిల్లీ ఫైల్స్‌’ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలు పోస్టర్స్‌తో పాటు టీజర్‌ కూడా విడుదల చేశారు. అయితే, తాజాగా టైటిల్‌ను మార్పు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, చాలామంది కోరికమేరకే టైటిల్‌ను మార్పు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌(Abhishek Agarwal)  నిర్మిస్తున్న  ‘ది ఢిల్లీ ఫైల్స్‌'(The Delhi Files) చిత్రాన్ని  ‘ది బెంగాల్‌ ఫైల్స్‌'(The Bengal Files)గా మార్పు చేస్తున్నట్లు దర్శకుడు వివేక్‌ అగ్ని హోత్రి ప్రకటించారు. సెప్టెంబర్‌ 15న పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీలో  మిథున్ చక్రవర్తితో పాటు పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌– ఐ యామ్‌ బుద్ధ ప్రొడక్షన్స్‌పై అభిషేక్‌ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించనున్నారు.

కొత్త టైటిల్ ‘ది బెంగాల్ ఫైల్స్’

విడుదల తేదీ మరియు నటీనటులు

చివరగా, ‘ది ఢిల్లీ ఫైల్స్’ సినిమా టైటిల్ మార్పుతో సినిమా ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచింది. సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.