
📌 Key Points
- నరేష్ తన జీవితం తన ఇష్టమని, తనకి నచ్చినట్టు మాట్లాడతానని అన్నారు.
- ట్రోల్స్ చేసినా తనకు నష్టం లేదని, ఎవరి కోసం మారనని నరేష్ స్పష్టం చేశారు.
- నరేష్ నటించిన ‘హే బల్వంత్’ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది.
- ‘హే బల్వంత్’ సినిమా ఓవర్సీస్‌లో 300 థియేటర్లలో విడుదలవుతోంది.
నటుడు వీకే నరేష్ తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా తనను ట్రోల్ చేస్తున్న వారి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తన కొత్త సినిమా ‘హే బల్వంత్’ విడుదల గురించి కూడా ఆయన మాట్లాడారు.
నా ఇష్టం.. ట్రోల్స్ గురించి పట్టించుకోను: నరేష్
VK Naresh: ఒకప్పుడు కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వీకే నరేష్ (VK Naresh).. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఆయన లేకుండా సినిమానే ఉండటం లేదంటే నమ్మాలి. ప్రత్యేకంగా నరేష్ కోసమే పాత్రలు రాస్తున్నారంటే, ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమాల పరంగా చాలా మంచి మార్క్ ఉన్న నరేష్, వైవాహిక జీవితం విషయంలో మాత్రం బాగా ట్రోల్ అవుతుంటారు. ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్‌లో ఆయన కూడా మారిపోయారు. స్టేజ్‌పై ఎలా పడితే అలా మాట్లాడేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్‌గా ఓ సినిమా ఈవెంట్‌లో ‘హగ్ ఇద్దామంటే అందరూ చీరలు కట్టుకొచ్చారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బాగా ట్రోల్ అయ్యారు. ఇదనే కాదు, ప్రతి ఫంక్షన్‌లో.. మరీ ముఖ్యంగా తన పాత్రకు చాలా ఇంపార్టెంట్ ఉన్న సినిమా ఫంక్షన్‌లో ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, నరేష్ అల్లరల్లరి చేస్తున్నారు.
‘హే బల్వంత్’ సినిమా విడుదల వివరాలు
తాజాగా ఇదే విషయాన్ని మీడియా ఆయనను ప్రశ్నించింది. వీకే నరేష్ ఓ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘హే బల్వంత్’ (Hey Balwanth). ఫిబ్రవరి 20న అధికారికంగా విడుదల కాబోతున్న ఈ సినిమా విశేషాలను తెలిపేందుకు యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నరేష్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నా లైఫ్ నా ఇష్టం.. నాకు నచ్చినట్లుగా ఉంటా, నాకు నచ్చినట్లుగా మాట్లాడతా. కావాలంటే మీరు ట్రోల్స్ వేసుకుంటారో, చేసుకుంటారో మీ ఇష్టం. వాటి వల్లన నాకేం పోదు. నాకేం నష్టం లేదు. ఎవరి కోసమే నేను మారను, మార్చుకోలేను. నాకు కావాల్సిన విధంగా నేను బతుకుతా. నాకు నచ్చిన సినిమా చేసుకుంటూ వెళ్తా. నా జీవితాన్ని నేను ఆస్వాదిస్తున్నాను అంతే. కావాలనుకుంటే సినిమా చూడండి, నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే ట్రోల్ చేయండి. నా లైఫ్ నా ఇష్టం.. అంతే’’ అని నరేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఓవర్సీస్‌లో భారీగా విడుదలవుతున్న ‘హే బల్వంత్’
ఇక సినిమా గురించి నరేష్ మాట్లాడుతూ.. ‘హే భగవాన్’ అని ముందు ఈ సినిమాకు టైటిల్ పెట్టాం. ఆ టైటిల్ బలవంతంగా మారి ‘హే బల్వంత్’గా రాబోతోంది. ఓవర్సీస్‌లో మూడు వందల థియేటర్లకు పైగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అక్కడ అన్ని చోట్లా హౌస్ ఫుల్సే. ఇక్కడ కూడా మంచి జోష్‌లో దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో వైబ్ చూసి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని అన్నారు అనిల్ సుంకర. మరో డైరెక్టర్ ఫోన్ చేసి రెండున్నర గంటలసేపు కడుపుబ్బా నవ్వించేశారని చెప్పారు. ఈ ఏడాది అంతా టాలీవుడ్‌కు కలిసి వచ్చేలా ఉంది. కొత్తదనంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుహాస్ (Suhas) ఈ సినిమాతో నెక్ట్స్ ఫేజ్‌లోకి వెళ్తున్నాడు.క్లైమాక్స్‌లో తను అందరినీ ఆకట్టుకుంటాడు. తెలుగు సినిమాల్లో ఈ సినిమా ఒక మెమరబుల్ ఫిల్మ్ అవుతుంది. అందరం విజయోత్సాహంలో ఉన్నామని చెప్పుకొచ్చారు.
నరేష్ తన జీవితాన్ని ఆస్వాదిస్తూ, తనకు నచ్చినట్లుగా జీవిస్తానని స్పష్టం చేశారు. ‘హే బల్వంత్’ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.


