|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వి.వి వినాయక్ ఆస్తుల చిక్కుముడి వీడింది! నిజమెంత? రియాలిటీ ఏమిటి?

Published: 25-03-2026, 8:35 AM
వి.వి వినాయక్ ఆస్తుల చిక్కుముడి వీడింది! నిజమెంత? రియాలిటీ ఏమిటి?
  • దర్శకుడు వి.వి వినాయక్ ఆస్తులపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు.
  • హైదరాబాద్‌లో కాకుండా సొంత ఊరిలో భూమి కొన్నామని వినాయక్ వెల్లడించారు.
  • తనకు వందల ఎకరాల భూములు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
  • బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తనకు తెలియదని వి.వి వినాయక్ తెలిపారు.

టాలీవుడ్ దర్శకుడు వి.వి వినాయక్ తన ఆస్తుల గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. తనకు వందల ఎకరాల భూమి ఉందనే వార్తలను ఆయన ఖండించారు. తన ఆస్తుల గురించి ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

వి.వి వినాయక్ ఆస్తులపై వదంతులు

V.V.Vinayak: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ దర్శకులు వి.వి వినాయక్ (V.V.Vinayak) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో యాక్షన్ సినిమా అంటే అందరికీ టక్కున వి.వి వినాయక్ గుర్తుకు వచ్చేవారు. ఈయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో వి.వి వినాయక్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈయన చివరిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ చత్రపతి రీమేక్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా తర్వాత ఎలాంటి కొత్త సినిమాలకు ఇప్పటివరకు కమిట్ అవ్వలేదు.

ఇలా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వి.వి వినాయక్ తన సినిమాల గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా పలు విషయాలను తెలియచేశారు. ఇకపోతే వి.వి వినాయక్ సినిమాలలో దర్శకుడుగా కొనసాగుతూ ఒకానొక సమయంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని , ఇప్పుడు ఆ ఆస్తులు విలువ కొన్ని వందల కోట్లు ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. ఇక ఈ విషయంపై ప్రశ్నలు ఎదురవగా వి.వి వినాయక్ స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు.

భూమి కొనుగోలుపై వినాయక్ క్లారిటీ

హైదరాబాద్ లో కోకాపేటలో ఎకరం 100 కోట్లు అని తెలుస్తుంది అయితే మీరు ఇక్కడ కొన్ని వందల ఎకరాలు కొనుగోలు చేశారంటూ వార్తలు వచ్చాయి నిజమైన అంటూ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తాను సినిమాలలో దర్శకుడిగా కొనసాగుతున్న సమయంలో సంపాదించింది మొత్తం మా నాన్న చేతిలోనే పెట్టాను. ఇక మా నాన్న ఆ డబ్బును భూమి పై ఇన్వెస్ట్ చేసిన మాట నిజమే కానీ హైదరాబాదులో కాదని తన సొంత ఊరిలో భూమి కొనుగోలు చేశారు. అక్కడ భూమికి పెద్దగా వ్యాల్యూ లేదని తెలిపారు. ఇక హైదరాబాదులో నాకు ఉన్నది ఈ ఇల్లు మాత్రమేనని వి.వి వినాయక్ క్లారిటీ ఇచ్చారు.

బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తెలీదు..

బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తెలియదన్న దర్శకుడు

సోషల్ మీడియాలో తనకు వందల ఎకరాలు భూములు వందల కోట్లు ఆస్తులు ఉన్నట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని ఈయన తెలియజేశారు. నేను దర్శకుడుగా కొనసాగుతున్న సమయంలో ఖరీదైన ఇంట్లో ఉండడం లగ్జరీ కార్లలో తిరగాలని కోరుకునే వాడిని నాకు కార్లు అంటే చాలా ఇష్టం కావడంతో కార్లు మాత్రమే కొన్నాను మిగిలిన విషయాలన్నీ మా నాన్న మా తమ్ముడు వాళ్ళు చూసుకునేవారు. ఇప్పటికీ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే తెలియదని చెబుతాను అంటూ వి.వి వినాయక్ క్లారిటీ ఇచ్చారు. తన ఫైనాన్షియల్ విషయాలన్నీ తన తమ్ముడు చూసుకోవడం వల్ల నాకు పెద్దగా ఆస్తుల గురించి అవగాహన కూడా లేదని ఈయన సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న వార్తలను ఖండించారు.

వి.వి వినాయక్ తన ఆస్తుల గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్టయింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.