|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిధి అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఆస్తి ఉండాలి? ఫ్యాన్ ప్రశ్నకు ప్రభాస్ షాక్!

Published: 27-12-2025, 3:03 PM
నిధి అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఆస్తి ఉండాలి? ఫ్యాన్ ప్రశ్నకు ప్రభాస్ షాక్!
  • రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిధి అగర్వాల్ ఫ్యాన్ ప్రదర్శించిన ప్లకార్డు వైరల్‌గా మారింది.
  • నిధి అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఆస్తి ఉండాలి అనే ప్రశ్న ప్రభాస్‌ను ఆశ్చర్యపరిచింది.
  • నిధి ‘ప్రొఫెషన్ ఆఫ్ లవ్’లో ఉండాలని బదులివ్వగా, ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదని చమత్కరించారు.
  • హీరోయిన్ల డ్రస్ సెన్స్ పై శివాజీ వ్యాఖ్యలు, నిధి ఇబ్బందిపడిన ఘటన కూడా చర్చనీయాంశమయ్యాయి.

ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఊహించని సంఘటన జరిగింది. హీరోయిన్ నిధి అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఆస్తి ఉండాలని ఒక అభిమాని అడిగిన ప్రశ్న సంచలనం రేపింది. ఈ ప్రశ్నకు ప్రభాస్, నిధి ఇచ్చిన సమాధానాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

నిధి అగర్వాల్ ఫ్యాన్ వైరల్ ప్లకార్డు

ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ మారుతీ తెరకెక్కించిన సినిమా ది రాజాసాబ్. ఈ సినిమా శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఖైతలాపూర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు వైరల్ అయింది. దానిని చూసిన యాంకర్ సుమ.. ప్లకార్డుపై ఉన్నది చదవగా.. హీరో ప్రభాస్ సహా అందరూ ఆశ్చర్యపోయారు. “నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి ? ఎంత ఆస్తి ఉండాలి? ఎలా ఉండాలి?” అని దానిపై రాసి ఉంది.

ఈ విషయాన్నే సుమ నిధిని అడగ్గా.. ప్రొఫెషన్ ఆఫ్ లవ్ లో ఉండాలని బదులిచ్చింది. ఇక వేదికపై నిధి స్పీచ్ తర్వాత.. చీరలోనే అన్ని నిధులూ ఉన్నాయని సుమ అనడంతో.. ఫ్యాన్స్ విజిల్స్ తో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. పనిలో పనిగా ప్రభాస్ ను కూడా పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీ ఏంటని ప్రశ్నించగా.. అది తెలియకే ఇంకా పెళ్లి చేసుకోలేదని డార్లింగ్ చెప్పిన సమాధానంకు నవ్వులు పూశాయి. కాగా.. ఇటీవలే నిధి అగర్వాల్ రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో అభిమానులు చేసినపనికి చాలా ఇబ్బంది పడింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవ్వగా.. హీరోయిన్ల డ్రస్ సెన్స్ పై శివాజీ చేసిన కామెంట్స్ పై పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే.

ప్రభాస్, నిధి సరదా సమాధానాలు

రాజాసాబ్ ఈవెంట్ హైలైట్స్, వివాదాలు

మొత్తం మీద, రాజాసాబ్ ఈవెంట్ కేవలం సినిమా ప్రచారం కోసమే కాకుండా, అభిమానుల ఆసక్తికర ప్రశ్నలు, స్టార్ల హాస్యభరిత సమాధానాలు, మరియు సామాజిక చర్చలకు వేదికై నిలిచింది. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.