
📌 Key Points
- యూత్ ఫుల్ కంటెంట్ తో ‘వాట్స్ అప్ నరేష్’ మూవీ గ్లింప్స్ విడుదల, సోషల్ మీడియాలో వైరల్!
- హీరో చెప్పే డైలాగ్ ‘ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా’ అదిరింది అంతే!
- సాఫ్ట్ వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు సివి విశాల్ తెరకెక్కించారు.
- ప్రేమికుల రోజున ‘వాట్స్ అప్ నరేష్’ మూవీకి సంబంధించిన రెండో గ్లింప్స్ రిలీజ్ చేయనున్న మేకర్స్!
టాలీవుడ్ లో మరో సెన్సేషనల్ మూవీ రాబోతోంది! ‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్ విడుదలై యూత్ లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. కావ్య కళ్యాణ్‌రామ్, అన్వేష్ మైఖేల్ జంట యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ‘వాట్స్ అప్ నరేష్’!
What’s Up Naresh Glimpse: బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్, కొత్తపోరడు ఫేమ్ అన్వేష్ మైఖేల్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాట్స్ అప్ నరేష్’. దర్శకుడు సివి విశాల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సివివి సినిమా బ్యానర్ పై భాగ్యలక్ష్మీ చింత నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ అండ్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్(What’s Up Naresh Glimpse) రిలీజ్ చేసి చేశారు మేకర్స్. “ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా” అని హీరో చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పంచింది.
గ్లింప్స్ లో ‘ఎనిమిది కోట్లు కట్నం’ డైలాగ్ సెన్సేషన్!
ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తుంటే సాఫ్ట్ వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది. ఇక గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన ‘లోకం తీరింతే.. నువ్వే మారాలంతే.. లొల్లె ఒద్దంటే.. తెలివిని కప్పెట్టంతే’ అనే సాంగ్ సినిమా కథని, హీరో పాత్రను తెలియజేసేలా ఉన్నాయి.
ప్రేమికుల రోజున మరో గ్లింప్స్ రిలీజ్!
ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇంకా ఈ సినిమాకి ఎడిటర్‌గా విప్లవ్ నైషదం, కెమెరామెన్‌గా వేదరామన్ శంకరన్ పని చేస్తున్నారు. ప్రేమికుల రోజున ఈ మూవీకి సంబంధించిన రెండో గ్లింప్స్ రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.
వాట్స్ అప్ నరేష్ మూవీ గ్లింప్స్ యూత్ ని ఒక ఊపు ఊపేస్తోంది. సాఫ్ట్ వేర్ లైఫ్ లో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


