|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమన్నాను రిజెక్ట్ చేసింది అందుకే! దర్శకుడి షాకింగ్ రీజన్ వైరల్

Published: 22-12-2025, 12:04 AM
తమన్నాను రిజెక్ట్ చేసింది అందుకే! దర్శకుడి షాకింగ్ రీజన్ వైరల్
  • రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించి, త్వరలో తెలుగులో విడుదల కానుంది.
  • సినిమాలోని ‘శరరత్’ పాటకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ గంగూలీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
  • తొలుత ఈ పాటలో తమన్నాను తీసుకోవాలని సూచించినా, దర్శకుడు ఆదిత్య ధర్ అంగీకరించలేదట.
  • ప్రేక్షకుల దృష్టి తమన్నాపై పడి కథ నుండి మరలిపోతుందని దర్శకుడు ఆమెను రిజెక్ట్ చేశాడని విజయ్ తెలిపాడు.

ధురంధర్ సినిమా సంచలన విజయం సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాట కోసం మొదట స్టార్ హీరోయిన్ తమన్నాను అనుకున్నారట. అయితే, దర్శకుడు ఆమెను రిజెక్ట్ చేసిన ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు అలా జరిగిందో వివరంగా తెలుసుకుందాం.

ధురంధర్: బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ సక్సెస్

Dhurandhar: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్. స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించాడు. పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్నీ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం కాసులే కాదు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుందో ఈ సినిమా. ఇండియన్ సినిమా స్టార్స్ కూడా ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తెలుగులో కూడా త్వరలోనే విడుదల కానుంది దురంధర్ సినిమా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు డాన్స్ కొరియోగ్రఫీ అందించిన విజయ్ గంగూలీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

పాట కోసం తమన్నాను ఎందుకు వద్దన్నారు?

Anaswara Rajan: క్యూట్ స్మైల్ తో కవ్విస్తున్న లేటెస్ట్ బ్యూటీ.. అనశ్వర రాజన్ ఫోటోస్

దర్శకుడి నిర్ణయంపై విజయ్ గంగూలీ కామెంట్స్

దురంధర్(Dhurandhar) సినిమాలో శరరత్ అనే స్పెషల్ ఉంది. ఈ సాంగ్ మంచి విజయాన్ని సాధించింది. ఈ పాటకు విజయ్ గంగూలీ డాన్స్ కంపోజ్ చేశాడు. అయితే ముందుగా ఈ పాటను తమన్నాతో చేద్దామని సలహా ఇచ్చాడట విజయ్ గంగూలీ. కానీ, దానికి దర్శకుడు ఆదిత్య ధర్ ఒప్పుకోలేదట. దానికి కారణం ఏంటంటే, “ఒకవేళ ఈ పాట తమన్నా చేస్తే ఆడియన్స్ కేవలం ఒక ‘స్పెషల్ ఐటమ్ సాంగ్’లా చూస్తారు. దానిని కథలో భాగంగా చూడలేరు. తమన్నా స్క్రీన్ మీద కనిపిస్తే అందరి దృష్టి ఆమె డ్యాన్స్‌ పైకి వెళ్తుంది. కాబట్టి, ఆడియన్స్ కథ నుంచి డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందని”వివరించాడట. ఆ మాటలు విని తాను నిజంగా ఆశ్చర్యపోయాను అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ గంగూలీ. దీంతో ఈ డాన్స్ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు ఆదిత్య ధర్ తీసుకున్న ఈ విలక్షణ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కథకు ప్రాధాన్యతనిస్తూ ఒక స్టార్ హీరోయిన్‌ను రిజెక్ట్ చేయడం పట్ల సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.