
📌 Key Points
- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
- భార్య రేణుకకు రమణారెడ్డితో వివాహేతర సంబంధం, ప్రైవేట్ వీడియోల మార్పిడి బయటపడింది.
- రేణుక ప్రవర్తన, ప్రైవేట్ వీడియోల కారణంగా సీతారాం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
- ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు రేణుక, ఆమె ప్రియుడు రమణారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భార్య వివాహేతర సంబంధం, ఆమె ప్రైవేట్ వీడియోలు చూసి తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం ప్రాణాలు కోల్పోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.
సీతారాం ఆత్మహత్య: అసలేం జరిగింది?
Hyderabad techie Seetharam suicide Case : హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ కేసును బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య రేణుక వ్యవహరించిన తీరుతోనే సీతారాం రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సీతారాం రెడ్డి(36) మృతదేహం హుస్సేన్ సాగర్ లో లభ్యమైంది. తొలుత సాధారణ ప్రమాదం లేదా ఆత్మహత్యగా భావించి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు… కోడలు రేణుకపై తీవ్ర ఆరోపణలు చేయడంతో కేసును బాచుపల్లి పోలీసులకు బదిలీ చేశారు. సీతారాం తండ్రి వెంకటేశ్వర్ ఫిర్యాదు మేరకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
2018లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఏడేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల పాటు సజావుగానే సాగిన వీరి సంసారంలోకి మూడో వ్యక్తి ప్రవేశించడంతో గొడవలు మొదలయ్యాయి.
సీతారాం భార్య రేణుకకు ఎం. రమణారెడ్డి అనే వ్యాపారవేత్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారం కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ ఏడాది జనవరిలో రేణుక ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దీనిపై సీతారాం రెడ్డి తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఆమె తన ప్రియుడితోనే ఉన్నట్లు తెలుసుకున్న సీతారాం తీవ్ర మానసిక కుంగుబాటుకు లోనయ్యారు.
భార్య రేణుక, ప్రియుడి నిర్వాకం
సీతారాం తండ్రి వెంకటేశ్వర్ చేసిన ఆరోపణలు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. రేణుకకు సంబంధించిన సన్నిహిత వీడియోలు తన కొడుకు సీతారాం దృష్టికి వచ్చాయని…. ఇది అతడిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసిందని ఆయన తెలిపారు. తన భార్య పరాయి వ్యక్తితో ఉన్న వీడియోలను చూడటం, ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన సీతారాం….. ఇక తట్టుకోలేక హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణల కింద…. ఏప్రిల్ 21న పోలీసులు రేణుక ఆమె ప్రియుడు రమణారెడ్డిని అరెస్ట్ చేశారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచిన అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో సీతారాం రాసిన 19 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. ఆమెను బుద్ధి మార్చుకోమని కోరినా వినలేదని…. మరింత రెచ్చిపోయిందని పేర్కొన్నాడు. పెళ్లైన తర్వాత వివాహేతర సంబంధాలు కొనసాగించిందని ప్రస్తావించాడు. పైగా వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ప్రైవేట్ వీడియోలను.. తన భార్య రమణారెడ్డికి షేర్ చేసిందని సీతారాం సూసైడ్ నోట్‌లో ప్రస్తావించాడు. అయితే రేణుక ప్రియుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని పేర్కొన్నాడు.ఈ విషయం తనని ఎంతో మానసిక వేధనకు గురిచేసిందని నోట్ లో రాశాడు.
కేసు దర్యాప్తు, అరెస్టులు
తన భార్యకు ఎలాంటి లోటు చేయలేదని… కానీ ఆమె తనకు నమ్మక ద్రోహం చేసిందని తన లేఖలో సీతారాం రాసుకొచ్చాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారాంకు.. నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ కుమారుడు సీతారామ్ ఆత్మహత్యకు కారణమైన రేణుకతో పాటు రమణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
సీతారాం ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన నిజాలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. ఈ ఘటన కుటుంబ సంబంధాల పవిత్రత, మానసిక ఆరోగ్యంపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.


