|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విత్ లవ్: టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ హీరోగా సంచలనం! అనస్వరతో కలిసి రొమాన్స్ అదుర్స్!!

Published: 30-01-2026, 10:05 AM
విత్ లవ్: టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ హీరోగా సంచలనం! అనస్వరతో కలిసి రొమాన్స్ అదుర్స్!!
  • టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ హీరోగా ‘విత్ లవ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
  • అభిషన్ సరసన ఛాంపియన్ బ్యూటీ అనస్వర హీరోయిన్‌గా నటిస్తోంది.
  • ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఉండనుంది.
  • సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి రానా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

ప్రేమకథా చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ హీరోగా ‘విత్ లవ్’ అనే సినిమాతో వస్తున్నారు. ఇందులో అనస్వర హీరోయిన్. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

హీరోగా మారిన టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్

With love Trailer: ఇటీవల కాలంలో ప్రేమకథా సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే .ఇలా ఎన్నో ప్రేమకథ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అతి త్వరలోనే మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. టూరిస్ట్ ఫ్యామిలీతో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అభిషన్ (Abishan)హీరోగా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. తెర వెనుక సినిమాని ముందుకు నడిపించిన ఈయన ఇప్పుడు హీరోగా ‘విత్ లవ్’ (with Love)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన విత్ లవ్ సినిమాలో అభిషన్ కు జోడిగా ఛాంపియన్ బ్యూటీ అనస్వర (Anaswara)హీరోయిన్ గా సందడి చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా మొత్తం కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఫీల్ గుడ్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా ఈ సినిమా విడుదల కానుందని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఈ లవ్ రొమాంటిక్ సినిమాని సౌందర్య రజనీకాంత్ మాగేష్ నిర్మించారు. ఇక తెలుగులో ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై దగ్గుబాటి రానా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అనస్వరతో కలిసి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ‘విత్ లవ్’

ఛాంపియన్ బ్యూటీతో టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతంగా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా చూపించారు. మరి ఫిబ్రవరి 6వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే అనస్వర రాజన్ హీరోయిన్గా ఛాంపియన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విత్ లవ్ సినిమా పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక దర్శకుడిగా తెరవెనక ఉంటూ సినిమాని ముందుకు నడిపించి మంచి సక్సెస్ అందుకున్న అభిషన్ లిటిల్ హార్ట్ సినిమాతో అందరి హృదయాలను కొల్లగొట్టారు. మరి తెర వెనుక మ్యాజిక్ చేసిన అభిషన్ తెరపై ఎలా ప్రేక్షకులను మెప్పించబోతున్నారో తెలియాలి అంటే ఫిబ్రవరి 6 తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్స్ విడుదల చేయబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సౌందర్య రజనీకాంత్ ఇటీవల దర్శకురాలిగా నిర్మాతగా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తన భర్త ధనుష్ నుంచి విడిపోయిన ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. విత్ లవ్ సినిమాకు కూడా ఐశ్వర్య రజినీకాంత్ నిర్మాతగా వ్యవహరించటం విశేషం .

ఫిబ్రవరి 6న విడుదల.. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్

విత్ లవ్ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ హీరోగా ఎలా మెప్పిస్తారో చూడాలి. సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తుండటంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.