
కొంత గ్యాప్ తర్వాత యమలోకం కాన్సెప్ట్ తో వస్తున్న యముడు సినిమా టీజర్ విడుదలైంది. జగదీష్ ఆమంచి హీరోగా, దర్శకుడిగా నటిస్తున్నారు. హిందూ ధర్మం ఆధారంగా రూపొందిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని తెలుస్తోంది.
Key Points
హిందూ ధర్మం ఆధారంగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్.
హీరో జగదీష్ ఆమంచి దర్శకత్వం వహించిన చిత్రం.
నవీన్ చంద్ర టీజర్ రిలీజ్ చేశారు.
యముడు సినిమా టీజర్ విడుదల
కొంతగ్యాప్ తర్వాత యమలోకం కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌లో ఓ మూవీ రాబోతుంది. యముడు టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు కూడా అతడే. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా కనిపించబోతున్నది.
యముడు మూవీ టీజర్‌ను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను గమనిస్తే ఇదొక మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ అని అర్థం అవుతుంది. సిటీలో వరుసగా అమ్మాయిలు మిస్సవుతుంటారు. నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఆ మిస్సింగ్ అమ్మాయిల హత్యకు లింక్ ఉన్నట్లుగా సస్సెన్స్ రేకెత్తిస్తూ ఈ టీజర్‌ను కట్ చేశారు. యముడు భూలోకంలోకి వచ్చి నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్కడే విధిస్తే ఎలా ఉంటుందన్నది టీజర్‌లో ఇంట్రెస్టింగ్‌ను పంచుతోంది.
హిందూ ధర్మం ఆధారంగా కథాంశం
టీజర్‌లోని ‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అనే డైలాగ్ చూస్తుంటే, ఈ సినిమా హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొత్త పాయింట్‌తో రూపొందుతోన్నట్లు తెలుస్తోంది. గరుడ పురాణం ప్రస్తావన ఈ మూవీలో ఉండబోతున్నట్లు సమాచారం. మైథలాజికల్ థ్రిల్లర్ మూవీలో ఆకాశ్ చల్లా ఓ కీలక పాత్రలో క నిపించబోతున్నాడు.
టీజర్‌కు విష్ణు రెడ్డి వంగా కెమెరా వర్క్, భవాని రాకేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తోన్నాయి.యముడు మూవీకి శివ కుండ్రపు స్క్రీన్‌ప్లే అందించారు. హరి అల్లసానితో కలిసి జగదీష్ ఆమంచి డైలాగ్స్ రాశారు. యముడు మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుతోన్నారు. త్వరలోనే యముడు మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు. ఈ సినిమాతోనే హీరోగా, డైరెక్టర్‌గా జగదీష్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో పలువురు కొత్త నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
జగదీష్ ఆమంచి హీరోగా, దర్శకుడిగా
యముడి కాన్సెప్ట్‌తో గతంలో తెలుగులో యమగోల, యముడికి మొగుడు, యమదొంగతో పాటు పలు విజయవంతమైన సినిమాలొచ్చాయి. వాటి సరసన తమ యుముడు మూవీ చేరుతుందని మేకర్స్ చెబుతోన్నారు.
యముడు సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ సినిమాతో జగదీష్ ఆమంచి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.


