
2012లో విడుదలై సంచలన విజయం సాధించిన అందాల రాక్షసి సినిమా జూన్ 13న మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలోని ‘ఏ మంత్రమో’ పాట యూట్యూబ్ లో లక్షలాది వ్యూస్ సాధించింది. ఈ పాట లిరిక్స్ ఇప్పుడు మీ కోసం.
Key Points
అందాల రాక్షసి సినిమా రీరిలీజ్!
ఏ మంత్రమో పాట లిరిక్స్ ఇక్కడే!
యువతను ఆకట్టుకుంటున్న సూపర్ హిట్ మెలోడీ!
అందాల రాక్షసి రీరిలీజ్
అందాల రాక్షసి మూవీ తెలుసు కదా. 2012లో రిలీజై సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ మూవీ జూన్ 13న రీరిలీజ్ కాబోతోంది. హను రాఘవపూడికి డైరెక్టర్ గా తొలి సినిమా. అంతేకాదు అందాల రాక్షసి, ఇప్పుడు మెగా ఇంటి కోడలు అయిన లావణ్య త్రిపాఠీకి అదే తొలి మూవీ. అందులో తన అమాయకపు చూపులు, అందంతో కట్టిపడేసింది. ఈ మూవీలోని ఏ మంత్రమో పాటలో ఆమె మరింత క్యూట్ గా కనిపిస్తుంది.
అందాల రాక్షసి సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులను అప్పట్లో అలరించాయి. అయితే ఈ ఏ మంత్రమో సాంగ్ మాత్రం మరికాస్త ఎక్కువగానే ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఇప్పటికే 18 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
రాధన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను వశిష్ట శర్మ రాశాడు. ఇక బోబో షాహి పాట పాడాడు. ఇప్పటికీ యువత మెచ్చే సాంగ్ ఇది. అందాల రాక్షసి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వేళ.. ఏ మంత్రమో పాటను మరోసారి నెమరువేసుకుంటూ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం.
‘ఏ మంత్రమో’ పాట విశేషాలు
అందాల రాక్షసి మూవీ 2012లో రిలీజైంది. ఇందులో లావణ్య త్రిపాఠి , రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్రలాంటి వాళ్లు నటించారు. ఈ ముగ్గురికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం. సాయి కొర్రపాటితోపాటు కలిసి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీని నిర్మించడం విశేషం.
పరుగులిక వరదలై పోయే కొత్తగా
ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే
లిరిక్స్
మనసు మతి చెదరగ శిలగా నిలిచెగా
కళ్ళల్లో కదిలింత.. కలగా కల కరిగిపోకలా
ఎదురయ్యే వేళల్లో.. నువు ఎగిరి పోకలా
అందాల రాక్షసి సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ‘ఏ మంత్రమో’ లాంటి అద్భుతమైన పాటలు మన హృదయాలను మళ్ళీ తాకుతాయి. ఈ సినిమాను మళ్ళీ ఆస్వాదించండి!


