
📌 Key Points
- మలయాళ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ 41 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మరణించారు.
- ఆయన మరణ వార్తను సీనియర్ నటి సీమా జి. నాయర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
- సిద్ధార్థ్ ‘కస్తూరిమాన్’, ‘భాగ్యజాతకం’ వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు పొందారు.
- చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో ఆయన టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు.
మలయాళ టెలివిజన్ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు కేవలం 41 సంవత్సరాలు. ఈ వార్త మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
సిద్ధార్థ్ వేణుగోపాల్ మరణం
Siddharth Venugopal: మలయాళ టెలివిజన్ రంగంలో మరో యంగ్ హీరో కన్నుమూశారు.కేవలం 41 ఏళ్ల వయసులోనే మలయాళ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ కన్నుమూయడం ఇప్పుడు ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఒక పక్క గ్లామర్ ప్రపంచంలో అందరినీ అలరిస్తూనే, మరోపక్క ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఒక యువ నటుడి ప్రయాణం ఇంత విషాదకరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు.
సీనియర్ నటి పెట్టిన పోస్ట్ వైరల్
గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో నరకయాతన అనుభవిస్తున్న ఆయన ఈరోజు (శనివారం) తుదిశ్వాస విడిచారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ముఖం వెనుక ఇంతటి బాధ ఉందా అని అందరూ షాక్ అవుతున్నారు. ఆయన మరణవార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక సిద్ధార్థ్ వేణుగోపాల్ మరణవార్తను సీనియర్ నటి సీమా జి. నాయర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కన్ఫర్మ్ చేశారు. ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.’సిద్ధూ..నిన్ను కాపాడుకోవడానికి నేను చేయని ప్రయత్నం లేదు, తిరగని హాస్పిటల్ లేదు..కానీ చివరికి విధి నిన్ను మా నుంచి లాగేసుకుంది” అంటూ ఆమె రాసిన మాటలు చూస్తే పరిస్థితి ఎంత బాధాకరంగా ఉందో అర్థమవుతోంది.
సీనియర్ నటి ఎమోషనల్ పోస్ట్
సూపర్ హిట్ సీరియల్స్‌తో స్టార్‌డమ్
సిద్ధార్థ్ వేణుగోపాల్ కెరీర్ విషయానికి వస్తే త్రిస్సూర్ జిల్లాలోని చాలకుడి కు చెందిన సిద్ధార్థ్ చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చారు. మొదట బ్రాడ్‌కాస్టర్‌గా, రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు.అక్కడ కస్తూరిమాన్’, ‘భాగ్యజాతకం’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కెరీర్ బాగుంది అనుకుంటున్న సమయంలోనే క్యాన్సర్ సిద్ధార్థ్ వేణుగోపాల్ పై ఎటాక్ చేయడం బాధాకరం.
ట్రీట్‌మెంట్ కోసం భారీ ఖర్చు
సిద్ధార్థ్ కెరీర్ ప్రస్థానం
గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ట్రీట్‌మెంట్ కోసం లక్షలు ఖర్చు చేసినా, కీమోథెరపీ వల్ల శరీరం బలహీనపడినా కూడా కెమెరా ముందుకు రావాలన్న ఆయన తపనకి హ్యట్సాఫ్ చెప్పాల్సిందే .ముఖ్యంగా సహనటుడు కిషోర్ సత్య సహా పలువురు నటులు సిద్ధార్థ్ మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. బుల్లితెరపై ఎంతో ఫ్యూచర్ ఉన్న ఒక నటుడు ఇలా ఉన్న పళంగా వెళ్లిపోవడం మలయాళ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెబుతున్నారు.సిద్ధార్థ్ వేణుగోపాల్కు తల్లి, తమ్ముడు ఉన్నట్టు తెలుస్తుంది.ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, టెలివిజన్ వర్గాలు సంతాపం ప్రకటిస్తున్నాయి.ఏది ఏమైనా… ఎంతటి సెలబ్రిటీ అయినా జీవితం ముందు, విధి ముందు తలవంచాల్సిందే అని సిద్ధార్థ్ మరణం మరోసారి గుర్తు చేసింది.
సిద్ధార్థ్ వేణుగోపాల్ మరణం మలయాళ బుల్లితెరకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.


