
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ యువ హీరోయిన్ కాంగ్ సియో హా క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. 31 ఏళ్ల వయసులో ఆమె మృతి చెందడం అందరినీ కలచివేసింది.
Key Points
యంగ్ హీరోయిన్ కాంగ్ సియో హా క్యాన్సర్ తో మరణించింది.
31 ఏళ్ల వయసులో క్యాన్సర్ కు చికిత్స పొందుతూ మరణించింది.
చివరి చిత్రం 'IntheNet' త్వరలో విడుదల కానుంది.
సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తమవుతోంది.
యువ హీరోయిన్ మృతి
గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు అనారోగ్య సమస్యలతో మరణిస్తే.. మరికొందరు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుంటూ అందరినీ ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడు కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త మర్చిపోక ముందే సీనియర్ నటి సరోజా దేవి(Saroja Devi) కన్నుమూశారు. ఇక వీరి మరణవార్త నుంచి బయటపడకముందే యంగ్ హీరోయిన్ క్యాన్సర్‌తో చనిపోయింది. దక్షిణ కొరియా నటి కాంగ్ సియో హా(Kang Seo Ha) 31 సంవత్సరాల వయసులో క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది.
కీమో థెరపీ రెండవ రౌండ్ చేయించుకుంటుండగా.. జూలై 13న మధ్యాహ్నం మరణించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాంగ్ సియో చివరగా ‘IntheNet’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ అమ్మడు హా కె-డ్రామాస్ స్కూల్ గర్ల్ డిటెక్టివ్స్, అసెంబ్లీ, ఫ్లవర్ ఆఫ్ ప్రిజన్, ఫస్ట్ లవ్ ఎగైన వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
క్యాన్సర్ తో పోరాటం
సినీ ప్రముఖుల సంతాపం
కాంగ్ సియో హా మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఆమె చిత్రాలు ఎల్లప్పుడూ మనసుల్లో నిలిచిపోతాయి.


