
📌 Key Points
- కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వంలో ‘యూత్’ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.
- ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు.
- ‘సఖియే’ పాటను సింజిత్ యెర్రమల్లి, సింధుజ తణుకు ఆలపించారు.
- ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ‘సఖియే’ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది.
కెన్ కరునాస్ దర్శకత్వంలో ‘యూత్’ అనే తమిళ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘సఖియే’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ పాటకు సంగీతం అందించారు.
‘యూత్’ మూవీ విడుదల తేదీ
Youth Movie: ప్రస్తుతం చిన్న సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ‘కోర్ట్, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాలు ఎటువంటి సక్సెస్‌ను అందుకున్నాయో అందరికీ తెలిసిందే. అలాగే కోలీవుడ్ హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ రూపొందించిన సినిమాలను కూడా టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడలాంటి ఓ చిన్న చిత్రమే టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కెన్ కరునాస్ (Ken Karunaas), అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘యూత్’ (Youth Movie). ఈ చిత్రాన్ని అదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ‘హౌస్ ఫుల్’ వినీత్, సందీప్. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, మార్చి 26న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు.
‘సఖియే’ పాట విశేషాలు
ఈ క్రమంలో సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీ నుంచి ‘సఖియే’ అనే లిరికల్ సాంగ్ (Sakhiye Telugu Lyrical Song)ను మేకర్స్ విడుదల చేశారు. ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్‌తో మొదలైన ఈ మూవీ ప్రమోషనల్ క్యాంపెయిన్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇప్పుడొచ్చిన ‘సఖియే’ పాట అయితే.. ‘ఈ పాట ఏంటి.. ఇంత బాగుంది’ అని అనిపించేలా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకలా అంటే, ఈ మధ్యకాలంలో వస్తున్న పాటలన్నీ.. మ్యూజిక్ బేస్ ఎక్కువ ఉంటూ, లిరిక్ అసలు అర్థమే కాకుండా ఉంటున్నాయి. అలాంటిది, ఈ పాటలో లిరిక్స్ చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అలా పాట కూడా చాలా అందంగా, అర్థవంతంగా ఉంది.
పాటకు ప్రాణం పోసిన గాయకులు
జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ సాంగ్‌కు కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా.. సింజిత్ యెర్రమల్లి, సింధుజ తణుకు గాత్రం హార్ట్ టచ్చింగ్‌గా ఉంది. ‘‘పలికానే పెదాలతోనే.. పలుమార్లు ఇలా నీ పేరే.. అలవాటే లేదాయే.. వెతికే మాయవి నీవేలే, ఒక మాటే మాటాడమంటే.. మదిదాటి రాలేను అందే.. విన్నావా అంటూనే పిలిచాయే నా మౌనాలే, కలవా.. కథవా.. నను తాకే అలవా.. మనసే సంద్రంలా మారిందా.. సఖియే, సఖియే.. కదిలే.. కదిలే..’’ అంటూ యువ జంట పాడుకునే అందమైన ప్రేమపాటగా ఈ ‘సఖియే’ పాట ఉంది. ఇది లిరిక్స్ చదవడానికి కాస్త గందరగోళంగా అనిపించినా, పాట వింటుంటే మాత్రం చాలా హాయిగా ఉన్నాయి. ప్రస్తుతం జనరేషన్ ప్రేమికులు ఈ పాటను ఓన్ చేసుకునేలా.. జీవీ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. మరెందుకు ఆలస్యం.. పాటని చూసేయండిక!
‘యూత్’ చిత్రం మార్చి 26న విడుదల కానుంది. ‘సఖియే’ పాట ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.


