
📌 Key Points
- రాజధానిగా MAVIGUN (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) పేరును పరిశీలించాలని జగన్ సూచన.
- అమరావతి కోసం రూ.2 లక్షల కోట్లలో 10% MAVIGUN అభివృద్ధికి చాలని జగన్ వ్యాఖ్య.
- 110 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న MAVIGUN ప్రాంతం గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని జగన్ అభిప్రాయం.
- ప్లాన్-బి కింద జగన్ ప్రతిపాదనను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా ‘ప్లాన్ బి’ పేరుతో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం గమనార్హం.
జగన్ ‘ప్లాన్ బి’ ప్రతిపాదన
అమరావతి చట్టబద్ధతపై వైసీపీ అధినేత జగన్ మాట్లాడారు. అసలు రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అనే అంశం లేదని చెప్పారు. ఈ సందర్భంగా ప్లాన్ బీ పేరుతో కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు వైసీపీ అధినేత. MAVIGUN పేరుతో క్యాపిటల్ డిక్లేర్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
‘ మచిలీపట్నం టూ విజయవాడ 70 కి.మీ, విజయవాడ టూ గుంటూరు 40 కి.మీ.. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పాం. మేం ప్రాక్టికల్‌గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు. ప్లాన్-బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు, పట్టించుకోలేదు. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. దీని కోసం అమరావతిలో పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్లలో 10 శాతం ఇక్కడ పెట్టినా చాలు.’ అని జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014కు సవరణలు చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ రాజధాని ప్రాంతానికి ‘ప్లాన్ బి’ అంటూ ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రతిపాదించి కొత్త చర్చకు తెరలేపారు.
MAVIGUN అభివృద్ధికి జగన్ సూచనలు
రాజధానిని అమరావతికే పరిమితం చేయకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుల వరకు విస్తరించి ఉన్న ఒక పెద్ద పట్టణ కారిడార్‌ను రాష్ట్ర రాజధాని ప్రాంతంగా ప్రకటించడాన్ని ప్రభుత్వం పరిగణించాలని సూచించారు. ఈ ప్రాంతాన్ని ఒక సమీకృత రాజధాని జోన్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇటువంటి నమూనా దీర్ఘకాలిక ఆర్థిక, మౌలిక సదుపాయాల వృద్ధికి దోహదపడుతుందని వాదించారు.
ప్రతిపాదిత రాజధాని ప్రాంతం మచిలీపట్నం, విజయవాడ , గుంటూరులను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్‌ను కలిగి ఉంటుందని జగన్ తెలిపారు. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ గ్రోత్ ఇంజిన్‌గా మారే సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.
ఒకవేళ MAVIGUN పేరు తమకు రాజకీయంగా ముడిపడి ఉందని భావిస్తే, ప్రభుత్వం మరో పేరును ఎంచుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు. ‘ఈ పేరు ప్రజలకు నన్ను గుర్తు చేస్తుందని మీకు అనిపిస్తే, మీరు దానికి వేరే పేరు పెట్టవచ్చు.’ అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు స్పందనపై జగన్ విమర్శలు
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు.. ఈ మూడు నగరాల ప్రాంతం సహజంగానే ఒక పట్టణ సమూహంగా ఏర్పడుతుందని జగన్ పేర్కొన్నారు. అభివృద్ధి మొత్తాన్ని ఒకే ప్రాంతంలో కేంద్రీకరించే బదులు, ప్రభుత్వం ఈ కారిడార్ మొత్తాన్ని రాజధాని ప్రాంతంగా లేదా రాజధాని కారిడార్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తద్వారా సమతుల్య, వికేంద్రీకృత అభివృద్ధికి వీలు కలుగుతుందని వాదించారు.
జగన్ ప్రకారం, ఈ మూడు ప్రాంతాల మొత్తం జనాభా దాదాపు 40 లక్షలు, మౌలిక సదుపాయాలు, కనెక్టవిటీ, పరిపాలన, పట్టణ సేవలపై దృష్టి సారించి పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాంతం ప్రణాళికాబద్ధంగా వేగంగా అభివృద్ధి చెందగలదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి గానీ, ఏ ప్రాంతానికి గానీ వ్యతిరేకం కాదని, రాజధాని విషయంలో తమ పార్టీ ఎన్నడూ ప్రాంతీయ వ్యతిరేక వైఖరి తీసుకోలేదని జగన్ స్పష్టం చేశారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
జగన్ తన ‘ప్లాన్ బి’ ద్వారా రాజధాని అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. అయితే, ఈ ప్రతిపాదనపై అధికార పార్టీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. ఇది రాష్టంలో రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.


