|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జీ తెలుగు వినాయక చవితి స్పెషల్.. మంచు మనోజ్ సదా మధ్య డైలాగ్ వార్.. సీరియల్ తారల అల్లరి.. ఎప్పుడంటే?

Published: 30-08-2025, 4:11 AM
జీ తెలుగు వినాయక చవితి స్పెషల్.. మంచు మనోజ్ సదా మధ్య డైలాగ్ వార్.. సీరియల్ తారల అల్లరి.. ఎప్పుడంటే?

జీ తెలుగు ఈ వినాయక చవితికి ప్రత్యేక కార్యక్రమం ‘గం గం గణేశా’ను అందిస్తోంది. మంచు మనోజ్, సదా ప్రత్యేక అతిథులుగా హాజరవుతూ, సీరియల్ నటులతో కలిసి వినోదాన్ని అందిస్తారు. భక్తి, వినోదం కలిగిన ఈ కార్యక్రమం ఆగస్టు 31న ప్రసారమవుతుంది.

Key Points

1

జీ తెలుగులో వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రామ్ ‘గం గం గణేశా’

2

మంచు మనోజ్, సదా మధ్య డైలాగ్ వార్ సందడి

4

ఆగస్ట్ 31న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు, జీ5లో ప్రసారం

‘గం గం గణేశా’ స్పెషల్ ప్రోగ్రామ్

ఆకట్టుకునే సీరియల్స్​, అలరించే రియాల్టీ షోలతో అలరిస్తున్న జీ తెలుగు ఈ వినాయక చవితి కి ప్రేక్షకులకు మరింత వినోదం పంచనుంది. మరో ప్రత్యేక కార్యక్రమంతో జీ తెలుగు తన బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

భక్తి, వినోదం కలగలసిన జీ తెలుగు అందిస్తున్న గణేష్​ చతుర్థి సంబరం గం గం గణేశా. సంస్కృతి, సంప్రదాయం మేళవించిన ఘనమైన వేడుక.. వెండితెర, బుల్లితెర తారల సందడితో సరదాగా సాగిన గం గం గణేశా ఈ ఆదివారం అంటే ఆగస్ట్ 31న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

జీ తెలుగు నటీనటులు అందరూ కలిసి ఈ వినాయక చవితిని ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. యాంకర్​ రవి, వర్షిణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హీరోయిన్​ సదా, హీరో మంచు మనోజ్​ ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు.

మంచు మనోజ్, సదా సందడి

ఇలా నటీనటుల గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమయ్యే ఈ వేడుక ఆద్యంతం వినోదం పంచే ప్రదర్శనలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచులతో సరదాగా సాగనుంది. సదా, మంచు మనోజ్ ​ మధ్య జరిగే డైలాగ్​ వార్, డ్రామా జూనియర్స్​ చిచ్చర పిడుగులు ఇరియా సుబ్రమణ్యం, హర్విన్​ రెడ్డి స్కిట్స్​, సీరియల్​ తారల అల్లరి, ఆటపాటలతోపాటు వినాయక చవితి సంబరాలు ఘనంగా జరుపుకోనున్నారు.

బుల్లితెర, వెండితెర తారల ఆటపాటలు, అల్లరితో వైభవంగా జరగనున్న వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం ‘గం గం గణేశా’ సంబరాన్ని జీ తెలుగు వేదికగా మిస్​ కాకుండా చూసేయండి అంటూ నిర్వాహకులు ప్రకటించారు. ఇకపోతే జీ తెలుగులో ఎన్నో సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

సీరియల్ నటీనటుల అల్లరి

ఇదెలా ఉంటే, చాలా కాలం గ్యాప్ తర్వాత మంచు మనోజ్, సదా ఇద్దరు ఒక స్టేజీపై కలిశారు. వీరిద్దరు కలిసి నటించిన సినిమా దొంగ దొంగది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు జీ తెలుగు గం గం గణేశా కార్యక్రమంలో మంచు మనోజ్, సదా కలవడం, ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

అయితే, దొంగ దొంగది సినిమాలో మంచు మనోజ్, సదా మధ్యలో వచ్చే సన్నివేశాలనే వారు మళ్లీ రీ క్రియేట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ గం గం గణేశా ఈవెంట్ జీ తెలుగు ఛానెల్‌లోనే కాకుండా జీ5 ఓటీటీ లో కూడా స్ట్రీమింగ్ అవనుంది.

జీ తెలుగు ‘గం గం గణేశా’ కార్యక్రమం వినాయక చవితిని వైభవంగా జరుపుకునేందుకు అద్భుతమైన అవకాశం. మంచు మనోజ్, సదా మరియు ఇతర నటీనటుల సందడిని మిస్‌ చేసుకోకండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.