
📌 Key Points
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీ.. ఇది కదా క్రేజ్ అంటే!
- సినిమా షూటింగ్ మొదలుకాకముందే జీ5 (ZEE5) ఓటీటీలో రూ. 68 కోట్ల భారీ డీల్!
- డైరెక్టర్ అనిల్ రావిపూడికి టాలీవుడ్‌లో ఉన్న సక్సెస్ రేటే ఈ రేంజ్ క్రేజ్‌కు కారణమా?
- వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టాలీవుడ్‌లో ఒక సంచలనం! అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న సినిమా ఇంకా ప్రారంభం కాకముందే భారీ రికార్డు సృష్టించింది. జీ5 ఓటీటీ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది.
అనిల్ రావిపూడి క్రేజ్ అంటే ఇదే మరి!
Zee5: ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓటీటీ సంస్థల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. అడిగినంత ఇవ్వడం పక్కన పెడితే, రిలీజ్ డేట్స్ కూడా అవే నిర్ణయిస్తున్నాయి. అయితే, ఓటీటీ సంస్థల నుంచి కూడా కేవలం స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే డిజిటల్ మార్కెట్‌లో భారీ ధర పలుకుతుంటుంది. కానీ, టాలీవుడ్‌లో ఒక దర్శకుడి బ్రాండ్ ఇమేజ్‌ను నమ్మి ఓటీటీ సంస్థలు కోట్లాది రూపాయలు పెట్టడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మరెవరో కాదు అనిల్ రావిపూడి.
ఇప్పటివరకు ఈ దర్శకుడు తన కెరీర్‌లో వరుసగా 9 విజయాలను అందుకుని అపజయమే ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఏకంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ఆయన స్థాయిని మరింత పెంచింది. ఈ సినిమా ఏకంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీ
కామెడీని, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పండించడంలో అనిల్ రావిపూడికి ప్రత్యేక శైలి ఉంది. ఇందులో భాగంగానే, తన నెక్స్ట్ సినిమాను కూడా అదే జానర్ లో చేస్తున్నాడు. అందుకోసం, విలక్షణ నటుడు వెంకటేష్- కళ్యాణ్ రామ్ ను కలిపేశాడు. ఈ ప్రాజెక్టుకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే వచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే దీని డిజిటల్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది.
జీ5 భారీ ఆఫర్.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు!
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఏకంగా రూ.68 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఒక స్టార్ హీరో సినిమాకు ఇచ్చే స్థాయి రెమ్యూనరేషన్ కేవలం దర్శకుడి క్రేజ్‌ను చూసి ఇవ్వడం అనేది టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుగా భావిస్తున్నారు. కనీసం ఒక్క ఫ్రేమ్, ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకముందే ఇంత భారీ డీల్ జరగడం అనేది అనిల్ రావిపూడి సక్సెస్ రేట్‌కు, ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.
మొత్తానికి అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ మొదలుకాకముందే ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


