
📌 Key Points
- ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా జింబాబ్వే, వెస్టిండీస్ ఇండియాలోనే ఉండిపోయాయి.
- దుబాయ్ విమానాశ్రయాలు మూతపడటంతో ప్రయాణాలు నిలిచిపోయాయి.
- ప్లేయర్లను సురక్షితంగా వారి దేశాలకు పంపే బాధ్యత ఐసీసీ తీసుకుంది.
- యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల విమానాశ్రయాలపై ఆందోళన నెలకొంది.
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావంతో టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు ఇండియాలోనే ఉండిపోయాయి. విమానాశ్రయాలు మూతపడటంతో ప్రయాణాలు నిలిచిపోయాయి. ఐసీసీ వారిని సురక్షితంగా పంపే బాధ్యత తీసుకుంది.
యుద్ధం కారణంగా నిలిచిన ప్రయాణాలు
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ పైన ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ( Iran – Israel US War) ప్రభావం పడింది. ఈ యుద్ధం కారణంగా టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన జింబాబ్వే, వెస్టిండీస్ ఇంకా ఇండియాలోనే ఉన్నాయి. రెండు రోజుల కిందటే ఈ రెండు జట్లు ఇండియాను వీడి… తమ తమ దేశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ యుద్ధం నేపథ్యంలో దుబాయ్ లాంటి విమానాశ్రయాలు మూసివేశారు. దీంతో ఇండియా నుంచి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అందుకే రెండు రోజులుగా ఇండియాలోనే సేద తీరుతున్నారు జింబాబ్వే, వెస్టిండీస్ ప్లేయర్లు. మరి మూడు రోజుల తర్వాత వెళ్లే ఛాన్సు ఉంది.
ప్లేయర్ల భద్రతపై ఐసీసీ ప్రకటన
యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని విమానాశ్రయాలు దాదాపుగా మూసివేశారు. ఇప్పుడిప్పుడే కొన్ని విమానాలు నడుస్తున్నప్పటికీ… మళ్లీ ఎప్పుడు యుద్ధం ఎక్కువ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఐసీసీ కీలక ప్రకటన చేసింది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన ప్లేయర్లు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. అన్ని జట్లను తమ తమ దేశాలకు చేర్చే బాధ్యత ఐసీసీ తీసుకుందని వెల్లడించింది. రెండు రోజులు ఆలస్యం అయినప్పటికీ ఇంటికి మాత్రం పంపిస్తామని పేర్కొంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.
గల్ఫ్ విమానాశ్రయాలపై ఆందోళన
A post shared by Sportskeeda Cricket (@sportskeedacricket)
యుద్ధ పరిస్థితుల కారణంగా క్రీడా జట్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఐసీసీ తీసుకున్న నిర్ణయం ప్లేయర్లకు ఊరటనిచ్చే అంశం. త్వరలోనే వారు తమ దేశాలకు చేరుకుంటారని ఆశిద్దాం.


