|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యాడ్‌ కోసం రూ. 100 కోట్లు.. అట్లీ, శ్రీలీల కాంబినేషన్‌ (వీడియో)

Published: 18-10-2025, 12:46 PM
యాడ్‌ కోసం రూ. 100 కోట్లు.. అట్లీ, శ్రీలీల కాంబినేషన్‌ (వీడియో)

సాధారణంగా సెలబ్రిటీలు యాడ్స్ చేస్తారు, కానీ ఈ ప్రకటన బడ్జెట్ అసాధారణం. చింగ్స్ దేశీ చైనీస్ యాడ్‌ కోసం ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేశారు. రణ్‌వీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ నటించిన ఈ ప్రకటనకు అట్లీ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ప్రోమో విడుదల చేశారు.

Key Points

1

చింగ్స్ దేశీ చైనీస్ యాడ్‌కు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు.

2

రణ్‌వీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు.

4

ప్రస్తుతం ప్రోమో విడుదల, పూర్తి వీడియో అక్టోబర్‌ 19న.

చింగ్స్ యాడ్‌కు రూ. 100 కోట్లు

సెలబ్రిటీలు వ్యాపార ప్రకటనలు చేయడం సహజం. అయితే, దాని బడ్జెట్‌ అనేది హీరో రేంజ్‌ను బట్టి ఉంటుంది. కానీ, బాలీవుడ్‌లో ఒక యాడ్‌ కోసం ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారని  తెలుస్తోంది. చింగ్స్ దేశీ చైనీస్ (Ching’s Desi Chinese) అనే కంపెనీ  ఈ యాడ్‌ కోసం బాలీవుడ్ హీరో  రణ్‌వీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్‌ను రంగంలోకి దించింది.  ఈ వాణిజ్య ప్రకటనను దర్శకుడు అట్లీ తెరకెక్కించారు.

ఈ యాడ్‌లో   రణ్‌వీర్ సింగ్ ఏజెంట్ చింగ్‌గా క‌నిపిస్తే.. శ్రీలీల ఏజెంట్ మిర్చిగా మెరిసింది. విల‌న్‌గా  బాబీ డియోల్ ప్రోఫెస‌ర్ వైట్ నాయిస్ పాత్ర‌లో క‌నిపించారు. ప్రస్తుతం ప్రోమో విడుదల చేశారు. పూర్తి వీడియోను  అక్టోబర్‌ 19న విడుదల చేయనున్నారు. రణ్‌వీర్ సింగ్ గతంలో కూడా చింగ్స్ దేశీ చైనీస్ కోసం యాడ్స్‌ చేశారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఆయన పనిచేశారు. అందులో తమన్నా భాటియాతో కలిసి ఓ ఇన్‌స్టంట్ నూడుల్స్ యాడ్‌లో కనిపించారు. ఈ యాడ్‌ కోసం స్టార్‌ యాక్టర్స్‌ నటించడంతో రెమ్యునరేషన్‌ భారీగా తీసుకున్నట్లు సమాచారం. అందుకే బడ్జెట్‌ కూడా పెరిగిపోయిందని ఇండస్ట్రీలో టాక్‌.

రణ్‌వీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్

అట్లీ దర్శకత్వంలో భారీ ప్రకటన

భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్‌తో ఈ ప్రకటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అట్లీ, రణ్‌వీర్, శ్రీలీల, బాబీ డియోల్ కాంబోలో రానున్న పూర్తి వీడియో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.