|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

12A Railway Colony Trailer: అల్లరి నరేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది

Published: 11-11-2025, 7:42 AM
12A Railway Colony Trailer: అల్లరి నరేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది

కామెడీ నుండి క్రైమ్ థ్రిల్లర్ బాట పట్టిన అల్లరి నరేశ్ ’12A రైల్వే కాలనీ’ ట్రైలర్ వచ్చేసింది. నాని కాసరగడ్డ దర్శకత్వంలో, అనిల్ విశ్వనాథ్ కథతో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో కామాక్షి భాస్కర్ల హీరోయిన్.

Key Points

1

అల్లరి నరేశ్ కామెడీ ట్రాక్ నుండి క్రైమ్ థ్రిల్లర్‌కు మారారు.

2

నాని కాసరగడ్డ దర్శకత్వం వహించగా, అనిల్ విశ్వనాథ్ కథ అందించారు.

4

నవంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం హత్య కేసు నేపథ్యంలో సాగుతుంది.

అల్లరి నరేశ్ కొత్త ప్రయోగం

కామెడీ సినిమాలతో అభిమానులను అలరించిన హీరో అల్లరి నరేశ్. అయితే గత కొంతకాలంగా తన ట్రెండ్‌కు భిన్నంగా మాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఉగ్రం, బచ్చలమల్లి చిత్రాలతో తన ట్రాక్‌ మార్చాడు. అయితే ఈ చిత్రాలేవీ ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. అయినా మళ్లీ అదే ట్రాక్‌లో వెళ్తున్నారు. ఈ సారి మాస్‌కు భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.

సినిమా ముఖ్యాంశాలు

తాజాగా అల్లరి నరేశ్ నటించిన క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని  నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం నవంబర్  21న థియేటర్లలో విడుదల కానుంది.

ట్రైలర్ హైలైట్స్ & రిలీజ్ డేట్

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే కథ మొత్తం మర్డర్ కేసు చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. ఓ హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది.  ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు.

ఒక హత్య కేసు చుట్టూ అల్లరి నరేశ్ ’12A రైల్వే కాలనీ’ కథ తిరుగుతుంది. సాయి కుమార్, వైవా హర్ష వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ నరేశ్‌కు కొత్త మలుపునిస్తుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.